Viral Video : నువ్వు సూపర్ అక్కా.. పామును మహిళ ధైర్యంగా ఎలా చేతులతో పట్టుకుందో చూశారా? వీడియో వైరల్!

Viral Video : ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళ ధైర్యంగా పామును రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిలాస్‌పూర్‌లోని డీఎల్‌ఎస్ పీజీ కాలేజీ ఆఫీస్ ప్రాంగణంలో ఈ వీడియోను రికార్డు చేశారు.

Viral Video : పామును దూరంగా చూస్తేనే భయంతో గజగజ వణికిపోతాం. అలాంటిది పామును దగ్గర నుంచి చేతులతో పట్టుకోగలమా? అంత ధైర్యం అందరికి ఉండదు. సాధారణంగా పామును పట్టేవారి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులోనూ విషపూరితమైన పాములను పట్టటం అంత సులభం కాదు. ఏం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆ పాము కాటుకు గురవుతారు.

Read Also : Viral Video : కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటున్న ఓలా డెలివరీ ఏజెంట్.. వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్!

అందుకే చాలా మందికి పామును చూడగానే భయపడిపోతుంటారు. అదే పాములను రక్షించేవాళ్లు మాత్రం ప్రమాదకరమైన పాములను కూడా చాలా సులభంగా పట్టేసుకుంటారు. పాములను పట్టడంతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళ ధైర్యంగా పామును రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిలాస్‌పూర్‌లోని డీఎల్‌ఎస్ పీజీ కాలేజీ ఆఫీస్ ప్రాంగణంలో ఈ వీడియోను రికార్డు చేశారు.

పామును రక్షించి గోనెసంచిలో వేసి.. :
కాలేజీ ఆఫీసులో పాము ఉందనే సమాచారం అందగానే అజితా పాండే.. అక్కడికి చేరుకుంది. టేబుల్‌పైన పాము దాగి ఉన్నట్టుగా వీడియోలో చూడవచ్చు. ఆమె కంప్యూటర్ సిస్టమ్ వెనుక చిక్కుకున్న పామును గుర్తించి వెంటనే తన చేతులతో పట్టేసుకుంది. కొంచెం కూడా భయపడకుండా ఆ పామును జాగ్రత్తగా పట్టుకుంటుంది. దాంతో అక్కడి సిబ్బంది ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయారు.

ఇంతకీ, ఆ పాము విషపూరితమైనదా? అని అడిగినప్పుడు.. అవును అది విషపూరితమైనదేనంటూ అజితా బదులిచ్చింది. పాము కాటు వేస్తుందనే భయం లేకుండా ఆమె నైపుణ్యంగా పామును రక్షించి సురక్షితంగా గోనె సంచిలో వేసింది. రెస్క్యూ మిషన్ విజయవంతమైన తర్వాత ఉద్యోగులు ఆమెను సూపర్ అక్కా అంటూ ప్రసంగించగా.. అజిత చిరునవ్వుతో ఆఫీసు నుంచి బయటకు వచ్చింది.

ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ :
అంతేకాదు.. ఇదొక ఎలుక పాము.. ఎలుకలను తినడానికి ఇది బహుశా ఈ ప్రదేశంలోకి వచ్చి ఉండవచ్చు. భయపడకండి అని ఆమె అక్కడి సిబ్బందికి ధైర్యం చెప్పింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో కూడా సిబ్బందికి సలహాలు ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అజితను ధైర్యవంతురాలంటూ అభినందిస్తున్నారు.

పామును పట్టుకోవడంలో ఆమె ప్రదర్శించిన నైపుణ్యాన్ని కూడా కొనియాడారు. ”ఆమె ధైర్యవంతురాలైన మహిళ” అంటూ ఒక యూజర్ కామెంట్ పెట్టగా, ఇంత ప్రశాంతంగా ఆడ పాములను రక్షించేవారిని ఎప్పుడూ చూడలేదని, ఆ మహిళకు వందనాలు అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

”మీరు పామును పట్టుకున్నప్పుడు అది కాటు వేయలేదా? పాములను పట్టుకునే టెక్నిక్ ఏంటి?.. అని మూడో యూజర్ ప్రశ్నించగా.. ‘ఆమె చాలా కూల్’ అని నాల్గో యూజర్ పోస్టు చేశాడు. అజితా పాండే బిలాస్‌పూర్ నివాసి.. ఆమె నర్సింగ్ అధికారి. జంతువులు, పాములను రక్షించడంలో ఆమెకు ఎవరూ చాటిలేరు. ఆమె సాధించిన అద్భుతమైన విజయాలు ప్రతిష్టాత్మక గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిపెట్టాయి.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు