Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.. మరో రెండు రకాలను విడుదలకు సిద్దం చేసింది. బిపిటికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన  ఎం.టి.యు – పన్నెండు ఎనబై రెండు రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ రబీకి అనువైన ఈ రకం ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తుంది.

Paddy Cultivation : మన ప్రధాన ఆహారపంట అయిన వరిలో ఖరీఫ్, రబీ కాలాలకు అనుగుణంగా ఎన్నో నూతన వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. తెలుగు రాష్ట్రాలనుండి అనేక వంగడాలు, జాతీయ స్థాయిలో విడుదలై మన పరిశోధనల విశిష్ఠతను దేశానికి చాటుతున్నాయి. అయితే వరి పరిశోధనల్లో పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం ముందంజలో వుంది. ఇప్పటికే ఎన్నో వరి వంగడాలను విడుదల చేచింది. ఇప్పుడు మరో రెండు కొత్తరకాలు విడుదలకు సిద్ధమవుతుంది . అయితే ఆ వరి వంగడాలు .. వాటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

వరిసాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విధంగా చేస్తున్న పరిశోధనలు.. క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు అందిస్తున్నాయి. దీనివల్ల గత దశాబ్ధ కాలంగా వరి దిగుబడుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఖరీఫ్ పంటకాలంలో రైతులు మధ్య, దీర్ఘకాలిక వరి రకాలను ఎక్కువగా సాగుచేస్తారు. దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుండి 160 రోజులు. మధ్య కాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు వుంటుంది.

సాగు నీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో వుంచుకుని, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకుంటుంటారు రైతులు. అయితే గత దశాబ్దకాలంగా వరి వంగడాల రూపకల్పనలో, పరిశోధనా ప్రగతి వేగం పుంజుకుంది. ఇప్పటికే అనేక మేలుజాతి రకాలు రూపొందించిన పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.. మరో రెండు రకాలను విడుదలకు సిద్దం చేసింది. బిపిటికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన  ఎం.టి.యు – పన్నెండు ఎనబై రెండు రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ రబీకి అనువైన ఈ రకం ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తుంది.

READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

విరగ పండిన ఈ వరి రకాన్ని చూడండి. కంకి పొడవు రైతుకు కనువిందు చేస్తోంది. ఒక్కో కంకిలో గింజల సంఖ్య 400 కు తగ్గకుండా వుంది. ఈ నూతన వరి రకం ఎమ్.టి.యు – పన్నెండు డభై ఒకటి. ఎంటియు 1075 , ఎంటియు 1081 తో సంకరపరిచి రూపొందించారు.  బీపీటీ తో సమానంగా గింజ వుండి, పొడవు ఎక్కువ వచ్చింది, పొడవాటి ముద్దకంకితో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. వర్షాలకు గింజలు చేనులో మొలకెత్తే స్వభావం లేదు. కాండం బలంగా, దృడంగా వుండి చేనుపై పడిపోదు. అన్నిటికీ మించి ఖరీఫ్ లో పంటకాలం తక్కువ వుండటం రైతులకు కలిసొచ్చే అంశం.

ట్రెండింగ్ వార్తలు