Bansilalpet Well : బన్సీలాల్‌పేటలో కళ్లుచెదిరే మెట్ల బావి.. ఔట్ స్టాండింగ్ అంటున్న సిటీ జనం

ఎప్పుడో వందల ఏళ్ల కింద తవ్విన ఈ బావిలో ఇంకా నీరు వస్తుండటం.. నిండిన మట్టిని పూర్తిగా తొలగించాక కూడా ఇప్పటికీ నీట ఊట కొనసాగడం అద్భుతమే.

Bansilalpet Steps Well : చరిత్ర కళ్ల ముందు కనిపిస్తే ఆ అనుభూతే వేరు. చరిత్రను తెలుసుకునేందుకు ఖండాలు దాటి.. సముద్రాల్లో మునిగేవాళ్లకు లెక్కేలేదు. అలాంటిది హైదరాబాద్ మహా నగరంలో రాజుల కాలం నాటి ఓ బావి ఇప్పుడు బయటపడింది. సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో కొన్ని శతాబ్దాలపాటు సేవలందించి.. దశాబ్దాలుగా నిరాదరణకు గురై.. రూపు రేఖలు కోల్పోయిన చారిత్రక మెట్ల బావి ఇప్పుడు కేసీఆర్ సర్కారు, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ NGO చొరవతో మళ్లీ జీవం పోసుకుంది.

Bansilalpet Steps Well 9

సికింద్రాబాద్.. బన్సీలాల్ పేటలోని ఈ మెట్ల బావి 17వ శతాబ్దం నాటిది. ఇది మంచి నీటి బావి. అప్పట్లో నిజాం రాజులు కట్టించారు. ఈ బావి కెపాసిటీ 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోని మెట్ల బావుల లాగే దీన్ని కూడా కళ్లు చెదిరేలా నిర్మించారు.

ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఈ బావి నిర్మాణమై ఉంది. భూమి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఈ నీటి ఊట కూడా 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు ఆ నీటి ఊట నుంచి వచ్చి బావిలో చేరుతోంది. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల స్వచ్ఛమైన నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ చెప్పారు. ఇంకొద్దినెలల్లోనే బావి మొత్తం పునరుద్ధరణ పని పూర్తవుతుందని చెప్పారు.

 

పెరుగుతున్న జనాభా.. విస్తరిస్తున్న నగరం.. పర్యావరణ అవగాహన కొరవడటంతో.. స్వాతంత్ర్యం తర్వాత దీని రూపురేఖలు మారిపోతూ వచ్చాయి. గడిచిన 40 ఏళ్లలోనే ఈ చారిత్రక మెట్ల బావి పాడైపోతూ వచ్చింది. పూర్తిగా చెత్తా చెదారం, మట్టి దుబ్బలతో నిండిపోయిన ఈ బావి ఇపుడు రీస్టోర్ అయింది.

2021 నాటికి ఇది చెత్త, మట్టి, దుబ్బతో పూర్తిగా పూడుకుపోయిన ఓ బావిలా మారింది. తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో.. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ప్రతినిధులు ఈ బావి పునరుద్ధరణ పనులను 2021లో ప్రారంభించారు. దాదాపు 5వందల టన్నుల మట్టి, చెత్తను లారీల్లో తొలగించారు. మట్టి తీస్తున్నకొద్దీ అద్భుతమే బయటపడింది. ఈ కాలం వారికి ఆనాటి అరుదైన, చారిత్రక మెట్ల బావిని చూపెట్టింది.

సికింద్రాబాద్ లో పురాతన బావి బయటపడిందన్న వార్త తెలిసి ప్రముఖులు దీనిని సందర్శించారు. సినీ నిర్మాత శోభు యార్లగడ్డ జనవరి 12న సైట్ ను విజిట్ చేసి ఫొటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చెత్తను డంప్ చేస్తున్న స్థలం నుంచి కొన్ని నెలల్లోనే కళ్లుచెదిరే బావిని బయటకు చూపారని ప్రశంసించారు.

జనవరి 27, 2022నాటికి బన్సీలాల్ పేట మెట్ల బావిలోని మట్టి మొత్తాన్ని ఆల్మోస్ట్ తీసేశారు. గోడలను, మెట్లను వాటర్ తో కడిగి నీట్ గా మార్చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎన్జీవో ప్రతినిధులు మెట్ల బావిని పరిశీలించారు. తాము ఖర్చుకు వెనుకాడటం లేదని.. దాదాపు 8వందల లారీల చెత్త తరలించి బావిని పునర్ వినియోగానికి సిద్ధం చేశామన్నారు. పంద్రాగస్ట్ నాడు మెట్ల బావిని టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ చేసి ప్రారంభిస్తామని చెప్పారు.

ఈ బావి నిర్మాణమే ఓ అద్భుతమని చెప్పాలి. ఎప్పుడో వందల ఏళ్ల కింద తవ్విన ఈ బావిలో ఇంకా నీరు వస్తుండటం.. నిండిన మట్టిని పూర్తిగా తొలగించాక కూడా ఇప్పటికీ నీట ఊట కొనసాగడం అద్భుతమే.

పర్యావరణ వేత్తలు, నిపుణులు, చరిత్రకారుల సూచనలతో.. హైదరాబాద్ లో మొత్తం 60 పురాతన మెట్ల బావులను బాగు చేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే గచ్చిబౌలి, లంగర్ హౌజ్ – బాపూఘాట్, మెట్టుగూడ, బన్సీలాల్ పేట సహా 6 మెట్ల బావులను పునరుద్ధరించారు. చారిత్రక, హెరిటేజ్ నిర్మాణాలను భావితరాలకు అందించాలన్న ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నిర్ణయాన్ని హైదరాబాద్ జనం ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Bansilalpet Step Well 1

Bansilalpet Step Well 2

Bansilalpet Step Well 3

Bansilalpet Step Well 4 A

Bansilalpet Step Well 4

Bansilalpet Step Well 5

Bansilalpet Step Well 6

Bansilalpet Step Well 7

Bansilalpet Step Well 8

Bansilalpet Steps Well 9

ట్రెండింగ్ వార్తలు