ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బస్సు ఢీ.. ముగ్గురి మృతి

Accident in Amangal: బస్సు వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్య సాగర్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు ముగ్గురు కారులో వస్తున్నాయి. అలాగే, అదే సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుందని ఓ ఆర్టీసీ బస్సు.

కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులోని వారు మృతి చెందారు. అందులోనే ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతి చెందినవారందరూ హైదరాబాద్ కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

హరియాణాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
హరియాణాలోని అంబాలా జిల్లాలోని జాతీయ రహదారిపై శుక్రవారం మినీ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.

వారంతా మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబాలా కాంట్ సివిల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కౌశల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Also Read: తిరుమలలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్

ట్రెండింగ్ వార్తలు