Meenakshi Natarajan: కాంగ్రెస్ తలుపుల తెరిచే ఉన్నాయి, ఎవరొచ్చినా స్వాగతిస్తాం..! మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు

పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి అంటూ మీనాక్షి నటరాజన్ అనడం వెనుక మతలబు ఏంటి? త్వరలో కాంగ్రెస్ లో చేరబోయే నాయకులు ఎవరు?

Meenakshi Natarajan: కాంగ్రెస్ తలుపుల తెరిచే ఉన్నాయి, ఎవరొచ్చినా స్వాగతిస్తాం..! మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు

Updated On : September 8, 2025 / 4:59 PM IST

Meenakshi Natarajan: ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ దృష్టి పెట్టిందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన పార్టీ తలుపులు మూసి లేవు, తెరిచే ఉన్నాయి అని ఆమె అన్నారు. అంతేకాదు పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.

త్వరలోనే నామినేటెడ్, కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. పార్టీలో చాలా రోజుల నుండి ఉన్న వారికి 80శాతం అవకాశం ఉంటుందన్నారు. వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన వారికి 20శాతం అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల పూర్తి లిస్ట్ పీసీసీ వద్ద ఉందన్నారు. ఒక వారంలో లిస్ట్ అప్రూవ్ చేస్తామన్నారు. కొన్ని చోట్ల నుండి పేర్లు రావాల్సి ఉందని, అవి చూసుకొని లిస్ట్ విడుదల చేస్తామని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు.

Also Read: బీజేపీలో కల్వకుంట్ల కవితను చేర్చుకుంటారా? ఎంపీ అర్వింద్ సమాధానం ఇదే..