KTR: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.. అంతేకాదు: కేటీఆర్

తానే ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్గొండ జిల్లా నకిరేకల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికైన వారికి కాగితాలు పంపిణీ చేసిందని, తానే ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులది ఎవరి దుకాణం వారిదే ఎవరి పని వారిదేనని అన్నారు. 56 క్రిమినల్ కేసులు 70 రోజులు జైల్లో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టిందని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ మాత్రం గోల్డ్ మెడల్ సంపాదించి నిత్యం విద్యార్థుల కోసం పోరాటం చేసే వ్యక్తి రాకేశ్ రెడ్డిని పోటీకి దింపిందని అన్నారు. రైతుబంధు పడలేదని అడిగిన రైతులను చెప్పుతో కొడతానని ఓ మంత్రి అన్నారని చెప్పారు. అదే మాట చెప్పిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Also Read: బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాలు విసిరాను: మంత్రి కాకాణి

ట్రెండింగ్ వార్తలు