బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాలు విసిరాను: మంత్రి కాకాణి

కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.

బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాలు విసిరాను: మంత్రి కాకాణి

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారని అన్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ తన ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని అన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. దీంతో తాను సోమిరెడ్డికి సవాల్ విసిరానని అన్నారు. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశానని చెప్పారు. తన పాస్ పోర్ట్ కారులో దొరికిందని చెప్పారని తెలిపారు. తన పాస్ పోర్ట్ తన వద్దే ఉందని చెప్పారు.

కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు. సోమిరెడ్డి దగ్గరా? కర్ణాటక పోలీసుల దగ్గరా? అని అన్నారు. సోమిరెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ కారుతో తనకున్న సంబంధాలను రుజువు చేయమని కోరానని అన్నారు.

ఆ కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్టిక్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. వారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయని తెలిపారు.

Also Read: కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు