Voters List Draft : తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల

తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.

Telangana voters list Draft : తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ సోమవారం (నవంబర్ 1, 2021) హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేశారు. ఈ సందర్భంగా శశాంక్‌ గోయల్‌ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

బూత్‌ లెవల్‌ ఆఫీసర్లను నియమించాలని, మృతి చెందిన వారి ఓట్లు తొలగించాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఓటు వేర్వేరు కేంద్రాల్లో వస్తున్నాయని, అలా కాకుండా అందరికీ ఒకే కేంద్రంలో ఓటు ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితాను 2022 జనవరి 5న ప్రకటిస్తామని వెల్లడించారు.

Counting Of Votes : హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుండటంతో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 4 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, 6న ఆ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. నవంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 6 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, డిసెంబర్‌ 27 నాటికి అభ్యంతరాలను పరిష్కరిస్తామని వెల్లడించారు.

నవంబర్‌ 1 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. 1 నవంబర్‌ నుంచి నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. నవంబర్‌ 6, 7, 27, 28 తేదీల్లో ఓటర్‌ నమోదుపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 20న అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది.

NEET-2021 : నీట్‌లో తెలంగాణ విద్యార్థికి టాప్‌ ర్యాంక్‌

తెలంగాణలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,52,57,690 మంది పురుషులు ఉన్నారు. మహిళా ఓటర్లు 1,50,97,292 మంది ఉన్నారు. 1,683 మంది థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. సర్వీస్‌ ఓటర్లు 4,501 (పురుషులు -3,965, మహిళలు-536) ఉన్నారు. 2,742 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. 5,01,836 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు