Vitamin C : విటమిన్ సి కోసం నిమ్మకు ప్రత్యామ్నాయంగా!

కివి పండులో అధికమైన విటమిన్ సి ఉంటుంది. రోజుకి సరిపోయే విటమిన్ సి లో 273 మిల్లీగ్రాములు లభిస్తుంది. కివి తియ్యగా పుల్లగా ఉండి, విటమిన్ ఎ, పీచు పదార్థం, కాల్షియం మరియు ఇతర పోషకాలను కూడా కలిగి వుంటుంది.

Vitamin C : శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచటంతోపాటు, కణాజాల పునరుత్పాదన పక్రియలో విటమిన్ సి కీలక పాత్రపోషిస్తుంది. కొల్లాజెన్ ఫైబర్స్ సంశ్లేషణలో విటమిన్ సి ఎంతగానో సహాయపడుతుంది. నారింజ, నిమ్మ,టమాటో, కివి,మామిడి వంటి కొన్ని రకాల ఆహారపదార్ధాల ద్వారా మన శరీరానికి సహజమైన మార్గంలో విటమిన్ సి అందుతుంది. విటమిన్ సిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు మెదడులో ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గిస్తాయి. వయస్సుమీరిన వారిలో వచ్చే మతిమరుపు వంటి ఇతర మెదడు సమస్యలు తొలగిపోతయాయి. పుండ్లు, గాయాలు తగ్గించటంలో విటమిన్ సి అవసరమౌతుంది. ఐరన్ శోషణకు విటమిన్ సి ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే అధిక రక్తపోటు, గాల్ బ్లాడర్ వ్యాధి, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, ఎథిరో స్క్లెరోసిస్ వంటి సమస్యలు చుట్టుమడతాయి.

వేసవి వచ్చిందంటే శరీరంలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు నిమ్మకాయలపై ఎక్కువగా అధారపడతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకాయల ధర అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో విటమిన్ సికోసం నిమ్మకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఆహారపదార్ధాలను తీసుకోవటం మంచిదని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకు పత్యామ్నాయమైన ఆహారల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కివి పండు ; కివి పండులో అధికమైన విటమిన్ సి ఉంటుంది. రోజుకి సరిపోయే విటమిన్ సి లో 273 మిల్లీగ్రాములు లభిస్తుంది. కివి తియ్యగా పుల్లగా ఉండి, విటమిన్ ఎ, పీచు పదార్థం, కాల్షియం మరియు ఇతర పోషకాలను కూడా కలిగి వుంటుంది.

జామకాయ: ఒక జామకాయలో 100 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలో కంటే దాదాపు 20 రెట్లు అధికంగా విటమిన్ సి జామకాయలో లభిస్తుంది. పచ్చి జామకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల ఎక్కువ విటమిన్ సి శరీరానికి అందుతుంది.

నారింజ రంగు: నిమ్మకాయలకు సమానంగానే నారింజలలో విటమిన్ సి లభిస్తుంది. 100 గ్రాముల నారింజ 53 గ్రాముల విటమిన్ సిని ఇస్తుంది. నిమ్మకాయలో కంటే నారింజలో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. కమలా పండ్లు విటమిన్ సి అత్యధికంగా ఉండే ప్రసిద్ధమైన పండ్లు. 1 పెద్ద కమలా పండులో 163 శాతం రోజుకి సరిపోయే విటమిన్ సి ఉంటుంది.

చింతపండు: చింతపండులో కూడా విటమిన్ సి లభిస్తుంది. నిమ్మకాయ లాగే పుల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో నిమ్మ కంటే ఎక్కువ ఐరన్, కాల్షియం, విటమిన్ బి ఉంటాయి. చింతపండు విటమిన్ B3, పొటాషియం, మెగ్నీషియంకు మంచి మూలంగా పనిచేస్తుంది. చింతపండులో ఎక్కువ ఖనిజాలు లభిస్తాయి.

పైనాపిల్ ; పైన్ ఆపిల్ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 1 కప్పు తాజా పైన్ ఆపిల్ పండులో 131 శాతం విటమిన్ సి ఉంటుంది. పైన్ ఆపిల్స్ లో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, పీచుపదార్థం కూడా ఎక్కువగానే ఉంటాయి.

క్యాప్సికమ్‌: విటమిన్ సి మంచి మొత్తంలో ఉన్న ఆకుపచ్చ, ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌ను కూడా తినొచ్చు. గ్రీన్ క్యాప్సికమ్ నిమ్మకాయ కంటే చౌకగా ఉంటుంది. నిమ్మకాయ కంటే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. క్యాప్సికమ్ కళ్ళకు మేలు చేస్తుంది. అలాగే బరువును నియంత్రించడంలో దోహదపడుతుంది.

ఉసిరి ; ఉసిరి దేశవాళీ ఉసిరికాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, రుచిలో పుల్లగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఆమ్లాలో 27.7 మిగ్రాల విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఎ , పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగానే ఉంటాయి.

మామిడిపళ్ళు : మామిడిపళ్ళలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 1 కప్పు మామిడిపండులో 76 శాతం విటమిన్ సి ఉంటుంది. వీటిల్లో పీచుపదార్థం, ఖనిజ లవణాలు మరియు విటమిన్లు ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రేగు పండ్లు: ఏప్రిల్ చివరి నాటికి రేగు పండ్లు అందుబాటులోకి వస్తాయి. వాటిలో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంతోపాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు