Himachal Pradesh CM: ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తల్లి పాదాలకు నమస్కారం చేసిన సుఖ్విందర్ సింగ్ సఖు

సుఖ్విందర్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ఒక డ్రైవర్ కొడుకు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా తన కొడుకు ఎన్నో మంచి పనులు చేస్తాడని ఆమె చెప్పారు.

Himachal Pradesh CM: హిమాచల్‌ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు సుఖ్విందర్ సింగ్ సుఖు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతూ తల్లికి పాదాభివదనం చేశారు. ఈ సందర్భంగా ఆమె కొడుకు సుఖ్విందర్‌కు తన ఆశీర్వచనాలు అందించారు.

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్!

సుఖ్విందర్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ఒక డ్రైవర్ కొడుకు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా తన కొడుకు ఎన్నో మంచి పనులు చేస్తాడని ఆమె చెప్పారు.

Himachal pradesh: సీఎం రేసులో పోటాపోటీగా ఆ ముగ్గురు నేతలు

ఇదిలాఉంటే హిమాచల్‌ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం శనివారం రాత్రి ఖరారు చేసింది. సీఎల్పీ తాజా మాజీ నేత ముకేశ్‌ అగ్నిహోత్రిని ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. వీరిద్దరూ ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ట్రెండింగ్ వార్తలు