Supreme Court : గంగా, యమునా నదుల ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది.

Ganga Yamuna Cleaning : గంగా, యమునా నదుల ప్రక్షాళన, పునరుజ్జీవంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గంగా, యమునా నదుల ప్రక్షాళన, పునరుజ్జీవానికి సబంధించిన కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించాలని సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది. ఎన్జీటీకి ఎందుకు వెళ్లకూడని పిటిషనర్ ను ప్రశ్నించింది.

Supreme Court : 68 మంది గుజ‌రాత్‌ జుడిషియ‌ల్ అధికారుల ప్ర‌మోష‌న్‌పై సుప్రీంకోర్టు స్టే

ప్రత్యేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నందున పిటిషన్ ను విచారణకు తీసుకోవడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. నదులను ప్రక్షాళన చేసి, వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వామి గురుచరణ్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్రెండింగ్ వార్తలు