Prabhas : ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఇటీవల 'సలార్' సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయం అయింది. గాయం పరిశీలించి వైద్యులు సర్జరీ చేయాలి అనడంతో ప్రభాస్ చికిత్స కోసం స్పెయిన్ కి వెళ్ళాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో.......

Prabhas :  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇటీవలే ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..

ఇటీవల ‘సలార్’ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయం అయింది. గాయం పరిశీలించి వైద్యులు సర్జరీ చేయాలి అనడంతో ప్రభాస్ చికిత్స కోసం స్పెయిన్ కి వెళ్ళాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్రభాస్ కి చికిత్స జరిగినట్లు తెలుస్తుంది. చికిత్స అనంతరం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని అక్కడి వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి కొన్ని రోజులు ప్రభాస్ అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక ప్రభాస్‌ సర్జరీ గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు