RRR: సర్‌ప్రైజ్.. నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఇండియాతో పాటు ఓవర్సీస్..

RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో ఈ మూవీ ఇటీవలే కలెక్షన్స్ లో రూ.1,000 కోట్ల మార్క్ ను దాటేసి.. రూ.1,500 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. బాక్సాపీస్ రికార్డులను బద్దలు కొడుతున్న ఈ సినిమా అటు హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ తో పాటు జక్కన్న కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయింది.

RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో సంగీతం ప్రముఖ పాత్ర పోషించింది. మొదటి సీన్ నుంచి పతాక సన్నివేశాల వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక, ఈ సినిమాలో కొమరం భీముడో పాట ఎన్టీఆర్ లోని నటుడుని మరోసారి ప్రపంచానికి పరిచయం చేయగా.. ‘నాటు నాటు’ అనే ఊరమాస్ పాటలో ఇద్దరు హీరోలు పోటీపడి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఎలా చూసినా కుదిరేలా లేదుగా!

ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మేటి డ్యాన్సర్లు వేసిన స్టెప్పులు ఈ పాటకు మేజర్ హైలైట్‌ కాగా.. లిరికిల్ సాంగ్ రిలీజ్ నుండే ఈ పాటకి ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ దక్కింది. ఈ పాటకి ఎందరో సెలబ్రిటీలు కూడా కాలు కదపగా.. ప్రమోషన్ కార్యక్రమాలలో బాలీవుడ్ స్టార్లు కూడా ఈ పాటకి స్టెప్పులేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా.. ఇప్పుడు ఈ ‘నాటు నాటు’ పాట ఫుల్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ పాట రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు