High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం

వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

MLA Jalagam Venkatarao

Kothagudem MLA Jalagam Venkatarao : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.  కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

కాగా, వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు.  వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం వెంకట్రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Adilabad : మద్యం మత్తులో భార్యతో గొడవ పడి.. స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యాయత్నం

వనమా వెంకటేశ్వరరావు సమీప అభ్యర్ధిగా ఉన్న జలగం వెంకట్రావును విజేతగా హైకోర్టు ప్రకటించింది. అంతేకాకుండా తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గానూ వనమా వెంకటేశ్వరరావుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. అలాగే 2018 నుంచి ఇప్పటివరకు వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ఇక నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగనున్నారు.

కోర్టు ఉత్తర్వులపై రిట్ పిటిషన్ వేస్తా : వనమా వెంకటేశ్వరరావు

హైకోర్టు తీర్పుపై వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులపై రిట్ పిటిషన్ వేస్తానని చెప్పారు. హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటానని తెలిపారు. నెల గడవు ఉన్నందున హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్తానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు