Telugu Film Hero’s: థియేటర్లపై హీరోల ఫోకస్.. సొంతగా కట్టేసుకుంటున్న స్టార్లు!

స్టార్ హీరోలు జస్ట్ హీరోలుగానే మిగిలిపోవట్లేదు. ఎన్ని సినిమాలు చేసినా అసలు బొమ్మ పడాలంటే ధియేటర్ ఉండాలి. అందుకే సినిమా చెయ్యడమే కాదు సినిమా చూపిస్తాం అంటున్నారు.

Telugu Film Hero’s: స్టార్ హీరోలు జస్ట్ హీరోలుగానే మిగిలిపోవట్లేదు. ఎన్ని సినిమాలు చేసినా అసలు బొమ్మ పడాలంటే ధియేటర్ ఉండాలి. అందుకే సినిమా చెయ్యడమే కాదు సినిమా చూపిస్తాం అంటున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోలవరకూ ఈ మద్య థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నారు.

Drugs Case: నేడు ఈడీ ముందుకు తరుణ్.. విచారణ ముగుస్తుందా?

హీరోలంటే జస్ట్ సినిమాలు చెయ్యడమే కాదు.. ఎవరో ధియేటర్లు ఇచ్చే వరకూ వెయిట్ చేసి చూడటం ఎందుకని.. సొంతగా ధియేటర్లు కట్టేసుకుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగారు . తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏషియన్ దేవరకొండ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఏవీడీ మల్టీప్లెక్స్ లవ్ స్టోరీ మూవీతో లాంచ్ కాబోతోంది. అల్ట్రా మోడర్న్ గా అన్ని ఫెసిలిటీస్ తో లావిష్ గా కట్టించిన ఏవీడీ మల్టీప్లెక్స్ సెప్టెంబర్ 24న ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతోంది.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

అల్లు అర్జున్ కూడాఏషియన్ గ్రూప్ తోనే కలిసి హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారు. అమీర్ పేట్ బిగ్ బజార్ పక్కన మల్టీప్లెక్స్ ప్లాన్ తో పాటు, ఫేమస్ సితార ధియేటర్ ని కూడా మల్టీప్లెక్స్ గా మార్చే ప్లాన్ లో బిజీగా ఉన్నారు బన్నీ. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా థియేటర్లున్న హీరో లిస్ట్ లోకి వస్తారు. ప్రభాస్ ధియేటర్ క్యాంపస్ ను ఫ్యాన్స్ ముద్దుగా బాహుబలి ధియేటర్లు అని కూడా పిలుస్తారు. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకున్న ప్రభాస్ మల్టిపుల్ స్క్రీన్లతో థియేటర్స్ స్టార్ట్ చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అటు సినిమాల మీద ఫోకస్ చేస్తూనే మరో వైపు ధియేటర్ల బిజినెస్ ని కూడా సూపర్బ్ గా రన్ చేస్తున్నారు. మెస్ట్ లావిష్ క్యాంపస్ తో పాటు లగ్జరీ థియేటర్లు మహేష్ బాబు సొంతం. ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు AMB మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. గచ్చిబౌలి లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్ స్టార్ సెలబ్రిటీస్ మూవీ అడ్డాగా మారిపోయింది.

ట్రెండింగ్ వార్తలు