Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లైపోయిందంటే.. వదిన క్యారెక్టర్లకో, అక్కక్యారెక్టర్లకో ఫిక్స్ చేసేస్తారు. కానీ హీరోలు మాత్రం వాళ్లకు పెళ్లిళ్లై, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నా..

Telugu Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లైపోయిందంటే.. వదిన క్యారెక్టర్లకో, అక్కక్యారెక్టర్లకో ఫిక్స్ చేసేస్తారు. కానీ హీరోలు మాత్రం వాళ్లకు పెళ్లిళ్లై, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నా కూడా ఇంకా హీరోలకింద కన్సిడర్ చెయ్యాల్సిందే. ఇలాంటి సీనియర్ హీరోలకు ఇప్పుడు క్రేజ్ లో ఉన్న హీరోయిన్లను సెట్ చెయ్యడం మేకర్స్ కు పెద్ద తలనొప్పై పోగా.. అలా సెట్ చేస్తే స్క్రీన్ మీద ఏజ్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది.

Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

ఇన్నేళ్ల కెరీర్ లో అందరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలు.. ఇప్పుడు క్రేజ్ లో ఉన్న యంగ్ హీరోయిన్లతో యాక్ట్ చేస్తున్నారు. దాంతో స్క్రీన్ మీద ఏజ్ గ్యాప్ గట్టిగా కనిపిస్తోందంటున్నారు కామన్ ఆడియన్స్. స్పెషల్లీ రవితేజ.. ఈమధ్య తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటిలో యంగ్ హీరోయిన్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 54 ఏళ్ల రవితేజ.. రీసెంట్ గా ఖిలాడి సినిమాలో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో డ్యూయెట్టేసుకున్నారు రవితేజ.

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

ఈ సినిమానేకాదు.. రవితేజ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలన్నింటిలో తనకంటే మినిమం 20, 30 ఏళ్లు చిన్నవాళ్లైన హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ధమాకా సినిమాలో జస్ట్ 21 ఏళ్ల శ్రీలీల ని హీరోయిన్ గా రివీల్ చేశారు. రామారావ్ ఆన్ డ్యూటీ సనిమాలో కూడా జెర్సీతో ఆడియన్స్ కి కనెక్ట్ అయిన 23 ఏళ్ల దివ్యాన్ష కౌషిక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!

66 ఏళ్ల సీనియర్ హీరో చిరంజీవి కూడా యంగ్ హీరోయిన్లతో జత కట్టక తప్పడం లేదు. తన ఏజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు లేకపోవడంతో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. అలా ఆచార్యలో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి భోళాశంకర్ లో తమన్నాతో హీరోగా చేస్తున్నారు.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

టాలీవుడ్ మన్మధుడు 61 ఏళ్ల నాగార్జున.. మోస్ట్లీ తన సినిమాలు యంగ్ హీరోయిన్లతోనే చేస్తారు. తన అప్ కమింగ్ మూవీ ఘోస్ట్ లో కుర్రహీరోయిన్ తోనే స్టెప్పులెయ్యబోతున్నారు. మరో సీనియర్ హీరో.. 61 ఏళ్ల వెంకటేష్ కూడా తన అప్ కమింగ్ మూవీ ఎఫ్ 3లో 32 ఏళ్ల తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారు.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

నందమూరి హీరో బాలయ్య ఇంకా సోలో హీరోగానే సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. ఈ 61 ఏళ్ల సాలిడ్ హీరోకి కూడా యంగ్ హీరోయిన్లే ఆప్షన్ అవుతున్నారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న మూవీలో తనకంటే పాతికేళ్లు చిన్నదైన శృతిహాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బాలయ్య.. అఖండలో 31 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ తో సాంగేసుకున్న సంగతి తెలిసిందే.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

లుక్ వైజ్, చార్మింగ్ వైజ్.. పవన్ కళ్యాణ్ ఇంకా సీనియర్ హీరో కాకపోయినా ఏజ్ వైజ్ రీసెంట్ గానే హాఫ్ సెంచరీ కొట్టారు. పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ లో తనకంటే 20 ఏళ్లు చిన్నదైన పూజాహెగ్డేతో, హరిహరవీరమల్లులో కూడా 28 ఏళ్ల నిధి అగర్వాల్ తో హీరోగా చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు