Tiger Nageswara Rao star Raviteja 73 movie titled as Eagle teaser release
Raviteja : రవితేజ తాజాగా తన కొత్త సినిమాని టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఈ మూవీ టైటిల్ ని నేడు (జూన్ 12) ఒక వీడియో ద్వారా అనౌన్స్ చేస్తామంటూ నిన్న తెలియజేశారు. తాజాగా ఆ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Jabardasth Hari : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మరోసారి జబర్దస్త్ కమెడియన్ హరి పేరు.. పోలీసుల గాలింపు!
ఈ చిత్రం రవితేజ కెరీర్ లో 73వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీకి ముందు నుంచి ‘ఈగల్’ అనే టైటిల్ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుందని టైటిల్ టీజర్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారా? లేదా? అనేది తెలియజేయలేదు. కానీ టైటిల్ టీజర్ విజువల్స్ అండ్ కట్ అదిరిపోయింది.
Sapthagiri : సైకిల్ ఎక్కనున్న సినీ నటుడు సప్తగిరి.. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి సిద్ధం..
కాగా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇక కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.