Tomato Price : మార్కెట్‌కు తరలిస్తున్న టమాటాల వాహనం చోరీ ..

పాపం టమాటాలు పండించిన పాపానికి ఓ రైతును దారుణంగా కొట్టారు. అతని బ్యాంకులో ఉన్న డబ్బుల్నీ కూడా కాజేశారు. అటు పండించి పంటాపోయి..ఇటు డబ్బుల పోయిన ఆ రైతు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకాసేపట్లో మార్కెట్ కు చేరుకుంటామనగా జరకూడని దారుణం జరిగిపోయింది.

tomato truck stolen : టమాటాలు పెద్ద సెలబ్రిటీలు అయిపోయాయి. ఎందుకంటే సెలబ్రిటీలు బౌన్సర్లను నియమించకుంటారు వారి భత్రత గురించి. ఇప్పుడు టమాటాలకు కూడా బౌన్సర్లు నియమించాల్సి వస్తోంది. యూపీలోని వారణాశిలో ఓ వ్యాపారి బౌన్సర్లను పెట్టుకుని మరీ టమాటాలు అమ్ముతున్నాడు. టమాటా తోటలకు సెక్యురిటీలు పెట్టుకుంటున్నారు రైతులు. ఇదంతా టమాటాలకు వచ్చిన డిమాండ్. భారీ స్థాయిలో టమాటాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో టమాటాలకు కూడా సెక్యురిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కిలో టమాటాలు రూ.160 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నాయి మరి. అందుకే ఈ తిప్పలన్నీ..ఇటువంటి రోజు వస్తుందని టమాటాలకు కూడా బౌన్సర్లను పెట్టుకోవాల్సి వస్తుందని బహుశా ఎవరు ఊహించి ఉండరు. దేశ వ్యాప్తంగా టమాటాల భద్రత పెద్ద సమస్యగా మారిపోయింది అటు రైతులకు, ఇటు వ్యాపారులకు కూడా. టమాటాల చోరీలు ఇటీవల బాగా పెరిగిపోవటంతో ఇటువంటి తిప్పలు తప్పటంలేదు.

టమాటాల ధరలు భారీగా పెరిగిపోవటంతో తాజాగా టమాటాలను మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని చోరీ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. చిత్రదుర్గలోని ఓ రైతు టమాటా పంట చేతికొచ్చేవరకు నిద్రాహారాలు లేకుండా కాపాలా కాచుకున్నాడు. ఎలాగైతేనే పంట చేతికొచ్చింది. కూలీలను పెట్టుకుని వేయి కళ్లతో కాపాలా కాచుకుని ఎట్టకేలకు కోత పూర్తి చేసి వాటిని వాహనంలోకిఎక్కించాడు. అలా కోత నుంచి వాహనంలోకి ఎక్కించే వరకు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలాతో పని పూర్తి చేశారు. ఇక మార్కెట్ కు తరలించి వాటిని సొమ్ము చేసుకోవటం అనే ఓ పెద్ద ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

Tomato Price : బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్న వ్యాపారి ..

దీంట్లో భాగంగా కోలార్‌ మార్కెట్‌కు 2 వేల కేజీల టమాటాలను తరలిస్తున్నాడు వాహనంలో. అది తెలిసిన కొంతమంది ఆ వాహనాన్ని ఫాలో అయ్యారు. అదను చూసి ఓ ప్రాంతానికి వెళ్లాక తమ వాహనాన్ని టమాటాల వాహనాన్ని ఢీకొట్టారు. అలా వాహనంతో టమాటాల వాహనాన్ని ఢీకొడుతు డ్రైవర్ కు చుక్కలు చూపించారు. అలా టమాటా వాహనాన్ని పక్కదారి పట్టించారు. ఆ తరువాత రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అంతేకాదు వారి వద్ద ఉన్నడబ్బు అంతా లాక్కున్నారు. అక్కడితో ఊరుకోలేదు. వారిద్దరిని బెదిరించి ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. ఆ తరువాత రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి టమాటాల వాహనంతో ఉడాయించారు.

దీంతో పాపం సదరు రైతు అంత కష్టపడి పంట పండించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకాసేపట్లో మార్కెట్ కు చేరుకుంటామనగా మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టమాటా దొంగల కోసం గాలింపు చేపట్టారు. కాగా టమాటాల ధరలు భారీగా పెరిగిపోతుండటంతో చోరీ ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు పొలాల వద్ద టెంట్లు వేసుకుని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ కాపాలా కాస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు