పదేళ్లలో నేనే సీఎం..! 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ మీతో చర్చలు జరిపారా? పులిలా ఉండే జగ్గారెడ్డి అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారా?

Weekend With Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఆయనొక విలక్షణ నేత. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అయితే ఆయన సంగారెడ్డిలో ఓడిపోవడం.. ఈ రెండింటి వల్ల గత కొంతకాలంగా లో ప్రొఫైల్ లో ఉంటున్నారు. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

”పులిలా ఉండే జగ్గారెడ్డి అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారా? సీఎం కావాలనే టార్గెట్ జగ్గారెడ్డికి ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ మీతో చర్చలు జరిపారా? రూ.10 కోట్లకు అమ్ముడుపోయారనే బీఆర్ఎస్ ఆరోపణలు నిజమేనా? జగ్గారెడ్డి అనగానే భూకబ్జాదారు అని ఒకరంటారు, రాబిన్ హుడ్ లా జేబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పంచేస్తారని మరొకరు అంటారు.. ఏది నిజం?

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన 9 మంది నాయకుల్లో మీరొకరు. ఎందుకిలా? ఈ ప్రశ్నలకు జగ్గారెడ్డి ఇచ్చిన సమాధానాలు ఏంటి? పదేళ్లలో నేనే సీఎం అంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో 10టీవీ వీకెండ్ స్పెషల్ ఇంటర్వ్యూ..

Also Read : సచివాలయం సాక్షిగా కులాల కుమ్ములాట.. ప్రభుత్వ పరువు తీస్తున్న అధికారులు

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు