Tomato Price : బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్న వ్యాపారి ..

ఓరి నాయనో టమాటా భద్రత కోసం ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. తన దుకాణం ముందు బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్నాడు. ఇది టమాటాల కాలం మరి..దటీజ్ టమాటా అనేలా ఉంది.

Bouncers for Tomato Safety : సాధారణంగా సెలబ్రిటీలు బౌన్సర్లను నియమించుకుంటారు. సెక్యురిటీ కోసం బౌన్సర్లు వారి చుట్టు భద్రతగా ఉంటారు. కానీ ఇప్పుడు కూరగాయాల్లో రాణీలా మారిపోయిన టమాటాలకు కూడా బౌన్సర్లు అవసరంపడ్డారు. ఎందుకంటే టమాటాల ధర బంగారంతో పోటీ పడుతోందా? ఏంటీ అనేలా ఉంది. టమాటాల ధరలు భారీగా పెరిగిపోవటంతో ఇటీవల టమాటాల దొంగలు పెరిగిపోయారు. దీంతో ఓ వ్యాపారి బౌన్సర్లను పెట్టుకుని మరీ టమాటాలు అమ్ముతున్నాడు. ఏంటో అంతా కలికాలం టమాటాలకు బౌన్సర్లేంటీ..?అలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనికి సంబంధించిన ఓ ఫోటోలు, వీడియోలు. కూరగాయలు అమ్మే వ్యాపారి తన షాపు ముందు బౌన్సర్లు నిలబడ్డారు. వారి భద్రతతో టమాటాలు అమ్ముతున్నాడో ఓ వ్యాపారి.

టామాటాల ధర కొన్నిచోట్ల కేజీ రూ. 250, కొన్ని చోట్ల రూ. 160 పలుకుతోంది. దీంతో సామాన్యులు టమాటాలు కొనటమే మానేసారంటే అది ఎంత భారంగా మారిందో ఊహించుకోవచ్చు. టమాటాల ధరలు భారీగా పెరగటంతో వ్యాపారులు వాటిని భద్రత విషయంలో కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టమాటాలకు కాపాలా పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో టమాటాల చోరీలకు భయపడిన ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను పెట్టుకుని మరీ అమ్ముతున్నాడు.

Tomato Price : టమాటా ధరలకు రెక్కలు.. కిలో రూ. 250, ఎక్కడంటే?

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి మార్కెట్లో కూరగాయలు అమ్మే అజయ్ ఫౌజీ అనే వ్యాపారి టమాటాల అమ్మకానికి వేల జీతం పెట్టి మరీ ఇద్దరు బౌన్సర్లను నియమించకున్నాడు. కొనడానికి వస్తున్న జనం ధర విని గొడవలు పడుతున్నారుని, సందట్లో సడేమియాగా లూటీ చేసిపోతున్నారని అందుకే ఇలా బౌన్సర్లు పెట్టుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు అజయ్. కష్టమర్లతో గొడవపడటంకంటే ఇదే బెటర్ అనిపించి ఇలా బౌన్సర్లను పెట్టుకున్నానని తెలిపారు.

యూపీలో పలు ప్రాంతాల్లో పలు విధాలుగా టమాటాల ధరలు ఉన్నాయి. టమాటాల ధర చెప్పగానే వామ్మో అంటూ చాలామంది వెళ్లిపోతున్నారని..కొంతమంది మాత్రం కొనలేక..మానలేక 50 గ్రాములు, మరి కొందరు 100 గ్రాములు కొంటున్నారు అని తెలిపారు వ్యాపారి అజయ్.

Tomato Song Viral : ధర తగ్గని టమాటా .. ఇంటర్నెట్‌లో‌ వైరల్ అవుతున్న పాట

కాగా టామాటా ధరలు భారీగా పెరిగిపోవటంతో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ రైతు పొలం నుంచి రూ. 3 లక్షల ఖరీదైన పంటను దొంగలు ఎత్తుకుపోయారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు టమాటాల చోరీలు తరచు జరుగుతున్నాయి. టామాటా బుట్టలు గల్లంతవుతున్నాయి. ధర లేనప్పడు స్వేచ్ఛగా వదిలేసిన రైతులు, వ్యాపారులు.. ఇప్పుడు నిద్రాహారాలు మాని మాని మరీ టమాటాలకు కాపాలా పడుకుంటున్నారు.కాగా. అధిక వర్షాలతో పాటు ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా టామాలకు ఈ తిప్పలు వచ్చి పడ్డాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు