Tomato Price : టమాటా ధరలకు రెక్కలు.. కిలో రూ. 250, ఎక్కడంటే?

ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది.

Uttarakhand Tomato : దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అందులో టమాటా ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. టమాటా ధర చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాటా ధర గరిష్టంగా పెరిగింది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ లో కిలో టమాట ధర రూ. 250కి పెరిగింది. ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది.

ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది. ముంబైతోపాటు పలు నగరాల్లో టమాటా ధర రూ.160 పలుకుతోంది. దేశవ్యాప్తంగా టమాటా సగటు ధర రూ.120 దాటింది. కోల్ కత్తాలో రూ. 152, ఢిల్లీలో రూ. 120, చెన్నైలో రూ. 117 గా ఉంది. ఇక అత్యల్పంగా రాజస్తాన్ లోని చురులో రూ. 31గా ఉంది.

Tomato Theft : కర్ణాటకలో రూ.2.5 లక్షలు విలువ చేసే టమాటా చోరీ

కాగా, అల్లం, వంకాయ.. టమాటాతో పోటీ పడుతున్నాయి. కూరగాయల ఉత్పతిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధర రూ. 250 దాటగా, వంకాయ రూ. 100 పలుకుతోంది. లక్నో, ఢిల్లీలో వారం వారం రోజుల వ్యవధిలోనే అల్లం రూ. 100 నుంచి రూ. 250 కి చేరింది.

ఇక టమాటా రూ.40 నుంచి రూ. 120కి, వంకాయ రూ.40 నుంచి రూ. 100 కు చేరాయి. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు