Tomato Theft : కర్ణాటకలో రూ.2.5 లక్షలు విలువ చేసే టమాటా చోరీ

మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు.

Thieves Thefts Tomatoes : దేశంలో టమాటా ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దీంతో దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో టమాటా పండించే రైతులు తమ పంటలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం టమాటాలను దోచుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో రూ.2.5 లక్షల విలువ చేసే టమాటాలను దొంగలు చోరీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లికి చెందిన మహిళా రైతు ధరణి తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను వేసింది. కాపు కూడా బాగా కాసింది. ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 పైనే పలుకుతోంది. దీంతో తమకు కాసుల వర్షం కురిసినట్లేనని ధరణి భావించింది. రేపోమాపో టమాటా తెంచి, బెంగుళూరుకు తరలించాలని ఆమె ప్లాన్ చేసుకుంది.

Mahabubabad: అర్థరాత్రి టమాటాలు చోరీ.. బాక్సులు మాయం.. రంగంలోకి పోలీసులు

అయితే, మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ధరణి తెలిపారు. మిగితా పంటను నాశనం చేశారని ఆమె వాపోయారు. బాధితురాలి కుమారుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు