Keshav Payyavula (Photo Credit : Google)
Keshav Payyavula : ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన వాపోయారు. గత ప్రభుత్వంపై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పు అనే వ్యసనానికి ఒక బానిసగా మార్చారు అని ధ్వజమెత్తారు. కొంతకాలం ఆ వ్యసనాన్ని ఫాలో కావాల్సిందే తప్ప మరో దారి లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.
”రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రాన్ని అప్పు అనే వ్యసనానికి ఒక బానిసగా మార్చారు. కొంతకాలం ఆ వ్యసనాన్ని ఫాలో కావాల్సిందే. మెల్లమెల్లగా ఆదాయం పెంచుకుంటూ వ్యసనానికి దూరంగా జరుపుతాము. వాస్తవ ఆర్థికస్థితిని వెల్లడించంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. గత టీడీపీ పాలనలో జరిగిన పనులన్నింటికీ జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. కోర్టు ఆదేశాలతో కొన్ని బిల్లులు చెల్లించారు. ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి” అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Also Read : సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన