సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన

మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు.

సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన

Yanamala Rama Krishnudu Letter To AP CM Chandrababu

Yanamala Rama Krishnudu Letter To AP CM Chandrababu : మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు.. చేపట్టాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. అవినీతిపరులు దిగమింగిన సొమ్మును తిరిగి రాబట్టేలా ప్రత్యేక చట్టం చేయాలని లేఖలో యనమల ప్రస్తావించారు. ఇప్పటికే వివిధ శాఖల్లో అవినీతిని వెలికితీసి కేసులు పెట్టేందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సమయంలో పలు సూచనలు చేస్తూ యనమల ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.

Also Read : కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

యనమల రాసిన లేఖలో.. వైసీపీ నేతలు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టo అమలు, ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని సూచించారు. జగన్ ప్రభుత్వo గత ఐదేళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు మన ప్రభుత్వం చేపట్టిన, సానుకూల పురోగతి చర్యలు అభినందనీయమని యనమల పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా నా అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నాను.. ఈ సూచనలు ఎన్నికల మేనిఫెస్టో అమలుకు, రాష్ట్ర ఖజానాను మెరుగుపరుస్తుందని భావిస్తున్నానని యనమల పేర్కొన్నారు.

Also Read : అభిమానం చాటుకున్న జనసైనికులు.. ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారు

యనమల లేఖలోని పలు అంశాలు..
పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించాలి.
కేంద్రం నుంచి ఎక్కువ డెవల్యూషన్ వచ్చేలా చూడాలి.
సహేతుకమైన స్థిరమైన రుణాలు తీసుకోవాలి.
ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్రాన్ని కోరాలి.
మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి.
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలి.
సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలి.