Samantha : ‘నువ్వు వారియర్‌వి.. నీ కోసం ప్రార్థిస్తుంటా..’ సమంత పోస్ట్ వైరల్..
బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : July 2, 2024 / 06:48 PM IST
Samantha Ruth Prabhu Prays For Hina Khan Calls Her a Warrior
బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. తాను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని అది 3వ దశలో ఉన్నట్లు ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఈ మహమ్మారి పై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలవాలని, అనుభవాలు, సలహాలు, మద్దతును అందించాలని ఆమె కోరారు. ఈ క్రమంలో నెటిజన్లతో పాటు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆమెకు ధైర్యానిస్తున్నారు.
‘నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి.’ అంటూ అంటూ నటి సమంత సైతం హీనా ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పోస్ట్ పై హీనా స్పందించింది. ‘సామ్ మీరు అన్నింటిలోనూ నిజమైన స్టార్. జీవితంలో మీకు ఎదురైన సవాళ్లను మీరు హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. మీ గురించి తెలుసుకుని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వదాలకు ధన్యవాదాలు.’ అంటూ హీనా అంది.
Tiragabadara Saami Trailer : రాజ్ తరుణ్ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వచ్చేసింది..
చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సమంత. గత కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడుతోంది. దీనికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటించింది. ఖుషి సినిమా తరువాత ఆమె మూవీలకు విరామం ఇచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది.
Maharaja – Kalki : వంద కోట్ల ‘మహారాజ’.. తమిళ్‌లో ప్రభాస్ ‘కల్కి’కి పోటీ ఇస్తున్న విజయ్ సేతుపతి..?
