Adipurush : ఆదిపురుష్ పై దారుణమైన ట్రోల్స్.. ముఖ్యంగా డైరెక్టర్ ఓంరౌత్ పై..

టెక్నాలజీ వాడితే ఇంకా బాగా చూపిస్తారనుకుంటే రామాయణాన్ని మార్చేశారు చిత్రయూనిట్. దీంతో ప్రేక్షకులు, అభిమానులు, ముఖ్యంగా భక్తులు అందరూ ఆదిపురుష్ సినిమాని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Trolls are increased on Adipurush movie and Director Om Raut

Trolls on Adipurush : ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ నిన్న జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించాడు. ముందు నుంచి సినిమాపై భారీ హోప్స్ పెంచేశారు చిత్రయూనిట్. అభిమానులు కూడా ఆదిపురుష్ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను తారుమారుచేస్తూ ఆదిపురుష్ అందర్నీ నిరాశపరిచింది.

రామాయణం అని చెప్పి, ప్రమోషన్ చేయడంతో మరోసారి రామాయణం చూస్తామని ఎంతో ఆశగా జనాలు థియేటర్స్ కి వెళ్లారు. కానీ తీరా సినిమాకు వెళ్తే రామాయణంలో వాళ్లకు ఇష్టమొచ్చినవన్ని పెట్టేసి పూర్తిగా మార్చేశారని ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. మనకు చిన్నప్పటి నుంచి రామాయణం అంటే ఒక అవగాహన ఉంది. మనం చదువుకున్నది, పురాణాలు చెప్పినవి, చరిత్ర చెప్పింది, మనం గతంలో ఎన్టీఆర్ రామాయణం సినిమాల్లో చూసింది అంతా ఒకటే. ఎక్కడా కూడా రామాయణం అనే ఫ్లేవర్ మిస్ అవ్వలేదు. కానీ మొదటిసారి రామాయణం అని చెప్పి టెక్నాలజీ అని చెప్పి రామాయణం ఫ్లేవర్ లేకుండా చేశారు.

Adipurush : మొదటిరోజు కలెక్షన్స్‌తోనే సంచలనం సృష్టించిన ఆదిపురుష్..

టెక్నాలజీ వాడితే ఇంకా బాగా చూపిస్తారనుకుంటే రామాయణాన్ని మార్చేశారు చిత్రయూనిట్. దీంతో ప్రేక్షకులు, అభిమానులు, ముఖ్యంగా భక్తులు అందరూ ఆదిపురుష్ సినిమాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కథ మార్చేశారని, ఆహార్యం మార్చేశారని, అసలు రామాయణంలాగే లేదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ ని ఐతే దీనికోసమా 500 కోట్లు ఖర్చు పెట్టింది అని మరింత ట్రోల్ చేస్తున్నారు. రామాయణం తెలుసుకోకుండానే రామాయణం తీశారా అంటూ విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఐతే మీమర్స్, నెటిజన్లు, సినిమా చూసిన వాళ్లంతా నిన్నటి నుంచే అదేపనిగా ఆదిపురుష్ సినిమాను, డైరెక్టర్ ఓం రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు