Twin elephants: కవల ఏనుగుల జననం.. 80ఏళ్లలో తొలిసారి ఇలా

శ్రీలంకలో ఓ ఆడ ఏనుగు కవలలకు జన్మనిచ్చింది. అరుదుగా 80ఏళ్ల తర్వాత మంగళవారం ఇలా జరిగినట్లు వైల్డ్ లైఫ్ అథారిటీస్ వెల్లడించింది. కవలలు రెండూ మగ ఏనుగులే అని..

Twin elephants: శ్రీలంకలో ఓ ఆడ ఏనుగు కవలలకు జన్మనిచ్చింది. అరుదుగా 80ఏళ్ల తర్వాత మంగళవారం ఇలా జరిగినట్లు వైల్డ్ లైఫ్ అథారిటీస్ వెల్లడించింది. కవలలు రెండూ మగ ఏనుగులే అని.. పిన్నవాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ లో సురంగి అనే 25ఏళ్ల ఏనుగుకు పుట్టాయి.

అదే ఏనుగుల అనాథాశ్రమంలో ఉండే 17సంవత్సరాల మగ ఏనుగు వీటికి తండ్రి అని తేలింది. లోకల్ హిరూ టీవీ మీడియా ఈ చక్కని దృశ్యాన్ని టెలికాస్ట్ చేసింది. తల్లి ఏనుగు కాళ్లు చుట్టూ తిరుగుతూ ఆకులు తింటూ ఉన్నాయి ఆ పిల్ల ఏనుగులు.

శ్రీలంక ఏనుగుల నిపుణులు.. ఇలా 1941లో కవల ఏనుగులు పుట్టాయని మళ్లీ ఇన్నేళ్లకు ఇలా జరిగిందని అంటున్నారు. శ్రీలంకలో అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిన పిన్నావాలాను 1975లో ఏర్పాటు చేశారు. గాయాలతో ఉన్న ఏనుగులు, అనాథలైన ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తుంటారు.

శ్రీలంకలో మొత్తం 7వేల 500ఏనుగులు ఉండగా.. అక్కడి జనాబా 22మిలియన్ మంది.

ట్రెండింగ్ వార్తలు