Fighting for sarees : శారీల కోసం సిగపట్లు.. బెంగళూరులో ఇద్దరు మహిళల ఫైటింగ్ వీడియో వైరల్

చీరల కోసం మహిళల మధ్య వాగ్వాదం.. చిన్నపాటి తగాదాలు చూసాం. కానీ బెంగళూరులో ఇద్దరు మహిళలు భీకరమైన యుద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

Fighting for sarees : బట్టల షాపుకి వెళ్తాం. ఎదుటివారికి నచ్చిందే మనకి నచ్చితే అలాంటిదే ఇంకోటి ఉందేమో అడుగుతాం. స్టాక్ లో లేకపోతే తెప్పించమని రిక్వెస్ట్ చేస్తాం. ఒకే చీర కోసం బెంగళూరులో ఇద్దరు మహిళలు జుట్టు పీక్కున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు. పోలీసులు, షాప్ సిబ్బంది వారిని శాంతింపచేయడానికి నానా తిప్పలు పడ్డారు.

Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

ఆడవారికి చీరలంటే మహా ప్రీతి. పండుగల్లో ప్రత్యేక రోజుల్లోనే కాదు క్లియరెన్స్ సేల్ టైంలో కూడా చీరలు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. బెంగళూరులోని మల్లేశ్వరం శారీ షాపు వారు క్లియరెన్స్ సేల్ మేళా పెట్టారు. ఇక మహిళలు పెద్ద ఎత్తున చీరలు కొనడనికి వచ్చేసారు. అందులో ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగారు. వాదన పెరిగి ఒకరి జుట్టు ఒకరు లాగడం.. చెప్పులతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారి యుద్ధాన్ని ఆపడానికి విఫల యత్నం చేసారు. మిగిలిన కస్టమర్లు వారిని ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు కదా వారి షాపింగ్ లో వారు బిజీగా కనిపించారు. చాలాసేపు వారి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో షేరై వైరల్ అవుతోంది.

Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

ఈ వీడియో చూసిన యూజర్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు ఇంత రచ్చ జరుగుతున్నా మిగిలిన కస్టమర్లు ఏమీ పట్టించుకోకుండా షాపింగ్ చేయడం భలే ఉందని కొందరు.. అక్కడ చీరలకు ఎంత డిమాండ్ ఉందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. చీరల మీద ఇష్టం ఉండొచ్చు. ఒకే చీర నచ్చిందనో.. ఒకే రంగు నచ్చిందనో ఇలా షాపుల్లో కొట్లాటలకు పోతే పోయేది తమ పరువే అనే విషయం ఆ లేడీస్ కి అర్ధమైందో లేదో?

ట్రెండింగ్ వార్తలు