Maharashtra Politics: ఏక్‭నాథ్ షిండేను రూ.50 కోట్లు ఇవ్వమంటూ అసెంబ్లీలో నిలదీసిన ఉద్ధవ్ థాకరే.. షిండే స్పందన ఏంటంటే?

ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్‭బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది

Uddhav Thackeray vs Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేను 50 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ పెద్ద ప్రకటన చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే శివసేన ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయల మొత్తాన్ని వెంటనే శివసేన యూబీటీకి బదిలీ చేయాలని అభ్యర్థించినట్లు షిండే పేర్కొన్నారు. అనంతరం ఈ విషయమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు.

Justice Rohit B Deo: ‘‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయను’’ అంటూ ఉన్నపళంగా రాజీనామా చేసిన హైకోర్టు జడ్జీ

అసలు విషయం ఏంటంటే.. ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్‭బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది. కాబట్టి ఆ డబ్బు మీద కూడా షిండే వర్గానికి హక్కు ఉంటుంది. దీంతో ఆ డబ్బు శివసేన ఖాతాలోనే ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ఆ మొత్తాన్ని తమకు బదిలీ చేయాలంటూ ప్రకటించారు.

Telangana Politics: అసమ్మతుల పంచాయతీకి పుల్‭స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్

ఏక్‌నాథ్ షిండే సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబాటు చేసిన అనంతరం నుంచి షిండే సహచరులు డబ్బులు ఎత్తుకెళ్లినట్లు థాకరే వర్గం పలుమార్లు విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణలపై షిడే స్పందిస్తూ.. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజున షిండే సభ లోపల పేపర్‌ను చూపిస్తూ.. ఉద్ధవ్ థాకరే, ఆయన బృందం తరపున ఎస్‭బీఐ ఖాతాలో 50 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు