Paddy Cultivation : ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అయినా సరిపడ వర్షాలు లేవు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ వరినారుమడులు పోసుకున్నారు. అయితే వరిసాగు సమయం దగ్గర పడుతుండటం.. మరోవైపు నారుమడులు పోయలేకపోయిన రైతులు నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేరుగా వెదజల్లే పద్దతికాని, డ్రమ్ సీడర్ తో కాని వరి సాగుచేస్తే.. కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా తక్కువ పెట్టుబడితో 10 రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందని చెబుతున్నారు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది. చాలా వరకు పంటలు విత్తారు. దీర్ఘకాలిక వరి రకాల నార్లమడులు పోసుకునే సమయం దాటి పోయింది. మధ్య , స్వల్పకాలిక రకాలను ఈ నెల 15 వరకు పోసుకోవచ్చు. అయితే ఈ విధానంలో సాగు పెట్టుబడులు అధికమవుతాయి. అంతే కాకుండా, కూలీల సమస్యను అధిగమించేందుకు.. మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందగా కోతకు వస్తుంది.
నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొవచ్చు.
ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. ఐ . తిరుపతి. వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యం తో పాటు ఎరువుల యాజమాన్యం కూగా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు