టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికేసులో సజ్జల, ఆర్కేలకు ఊరట

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది.

AP High Court

TDP Central Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది. ఈ కేసు విషయంపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు వరకు సజ్జల, ఆర్కేలను నిందితులుగా చేర్చలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ నిందితులుగా వీరిని చేర్చితే ఐదు రోజుల ముందే సమాచారం ఇస్తామని చెప్పారు. దీంతో సజ్జల, ఆర్కే హైకోర్టులో వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Also Read : కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఏఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయో తెలుసా..

వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కేంద్రం కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి కేసులో నిందితులుగా దేవినేని అవినాశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ తోపాటు తదితరులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తొందరలోనే వీరందరినీ అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సజ్జల, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తులశిల రఘురాం, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ లు ముందస్తు బెయిల్ కు హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి.. వైసీపీ నేతలను జూలై 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 16న మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మంగళవారం ఈ కేసులో హైకోర్టులో విచారణ జరగగా.. సజ్జల, రామకృష్ణా రెడ్డిల పేర్లు నిందితుల జాబితాలో చేర్చలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు సజ్జల, ఆర్కే దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది

Also Read : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతల ప్రశంసలు.. రాజధాని అమరావతి పనులు పరుగులు పెడతాయని..

మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారన్న కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్, నందిగాం సురేష్ కు ముందస్తు బెయిల్ ను హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది.

 

 

ట్రెండింగ్ వార్తలు