Kazipet Wagon Production : కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారనుంది. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.

Kazipet wagon production

Union Government Key Decision : కాజీపేట రైల్వే జంక్షన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాజీపేటలో వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ను అప్ గ్రేడ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ను మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారుస్తున్నట్లు ఈ మేరకు ప్రకటించింది.

దీంతో కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారనుంది. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్ల తయారీ సామర్థ్యం కానుంది. రెండో సంవత్సరం 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యాన్ని రైల్వే శాఖ అందుకోనుంది.

Indian Railway: రైల్వేలో తరుచూ ప్రయాణం చేస్తుంటారు.. అయినా చాలా మందికి ఈ విషయం తెలియదు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచుస్తోన్న వరంగల్ ప్రజలకు కేంద్రం నిర్ణయం ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఇప్పటికే వరంగల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మణికొండ మెట్టు రామలింగేశ్వరస్వామికి సంబంధించిన దేవాదాయ శాఖ భూముల్లో వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ను మంజూరు చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

రాష్ట్ర విభజన హామీల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఒకటిగా ఉంది. రామలింగేశ్వరస్వామికి సంబంధించిన 430 ఎకరాల దేవాదాయ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేటాయించింది. జులై 8న ప్రధాని మోదీ వరంగల్ కు రానున్న నేపథ్యంలో కాజీపేట వ్యాగన్ ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు