Upasana : దుబాయ్‌లో ఉపాసనకి సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) అండ్ ఉపాసన (Upasana) దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా అక్కడ ఉపాసనకు తన సిస్టర్స్ సీమంతం చేశారు.

Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) పెళ్లి అయిన పదేళ్ల తరువాత తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతూ పేరెంట్ హుడ్ లోకి అడుగు పెడుతున్నారు. ఇక మెగా వారసుడి కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్న మెగా కుటుంబానికి, అభిమానులకు ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో ఈ శుభవార్తని స్వయంగా చిరంజీవి అందరికి తెలియజేశాడు. ఈ ఏడాది ఆగష్టులో మెగా వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ అండ్ ఉపాసన దుబాయ్ లో ఉన్నారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!

మొన్నటి వరకు RRR ప్రమోషన్స్, RC15 షూటింగ్స్ అంటూ గ్యాప్ లేకుండా గడిపాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ రెండిటికి విరామం రావడంతో చరణ్, ఉపాసనను తీసుకోని రిలాక్స్ అవ్వడానికి ఇటీవల దుబాయ్ వెళ్ళాడు. ఇక అక్కడ ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వెకేషన్ లోనే ఉపాసనకి తన సిస్టర్స్ సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాసన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన సిస్టర్స్ కి థాంక్యూ చెప్పింది.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. పుష్ప రాజ్ ఎక్కడ?

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రగ్నెన్సీ విషయంలో రామ్ చరణ్ అండ్ ఉపాసన చాలా మాటలు ఎదురుకున్నారు. తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీని గురించి ఉపాసన మాట్లాడుతూ.. సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను తల్లిని కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం ఆనందంగా, గర్వంగా ఉంది. నేను, చరణ్ ముందే అనుకున్నాం. పెళ్లయిన పదేళ్ల తర్వాతే మేము బిడ్డని కనాలనుకున్నాం. మేమిద్దరం మా రంగాల్లో బాగా ఎదగాలి, ఆర్ధికంగా మరింత బలోపేతం అవ్వాలి అనుకున్నాం. అందుకే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. సమాజం, బంధువులు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ పదేళ్ల నుండి నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ మాటలకు మేము తలొంచలేదు అంటూ చెప్పుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు