Team India : భారత్ ఇప్పుడు ప్రపంచ అగ్రభాగాన ఉంది.. టీమ్ఇండియాకు టాలీవుడ్ సెల‌బ్రిటీల అభినంద‌న‌లు

17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది.

17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది. న‌రాలు తెగె ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ 7 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి (76) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. అక్ష‌ర్ ప‌టేల్ (47)లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో అన్రిచ్ నోర్జే, కేశ‌వ్ మ‌హ‌రాజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మార్కోజాన్సెన్‌, ర‌బాడ‌లు చెరో ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ల‌క్ష్య ఛేద‌న‌లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52). ట్రిస‌న్ స్ట‌బ్స్ (21 బంతుల్లో 31), క్వింట‌న్ డికాక్ (31 బంతుల్లో 39) చెల‌రేగ‌డంతో ఓ ద‌శ‌లో భార‌త అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే.. భార‌త బౌల‌ర్లు కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు తీసి ఆ జ‌ట్టును క‌ట్ట‌డి చేసి చాన్నాళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా టీమ్ఇండియాకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సెల‌బ్రిటీలు భార‌త జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

Kalki Part 2: కల్కి-2 మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఛేంజ్‌?

’17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను గెలవడం అద్భుతం. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉంది. కోహ్లీ చ‌క్క‌గా ఆడావు. బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్ అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆటతీరు కనబర్చిన యావత్ జట్టుకు శుభాభినంద‌న‌లు. అలాగే నమ్మశక్యం కానీ రీతిలో క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్ అదరహో అనిపించాడు.’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు