Kalki Part 2: కల్కి-2 మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఛేంజ్‌?

సంతోష్‌ నారాయణ్‌ ప్లేసులో కల్కి-2 సినిమాకు కీరవాణి మ్యూజిక్‌ డైరెక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నారట చిత్ర యూనిట్‌.

Kalki Part 2: కల్కి-2 మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఛేంజ్‌?

డార్లింగ్‌ ప్రభాస్‌ హిట్‌ కొట్టేశాడు. కల్కితో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. అటు కలెక్షన్ల పరంగానూ ఫుల్‌ జోష్‌తో ఉంది సినిమా యూనిట్‌. కానీ, ఒక్క విషయంలో అందరిదీ ఒకటే మాట…. హాలీవుడ్‌ రేంజ్‌లో తీసిన సినిమా… మ్యూజిక్‌ లవర్స్‌ను మాత్రం నిరూత్సాహానికి గురిచేసిందనే టాక్‌ ఒక్కటే మైనస్‌గా మారింది. అందుకే కల్కి -2లో మార్పు చేయబోతున్నారని అంటున్నారు?

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తాజా బ్లాక్‌బస్టర్‌ కల్కి.. భార‌తీయ పురాణాల‌కు గ్రాఫిక్స్‌, యాక్షన్ హంగుల‌ను జోడించి తెర‌కెక్కించిన మూవీ… తొలి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో థియేటర్ల ముందు హౌస్‌ ఫుల్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. ఐతే సినిమా చూసిన వారంతా కథ, యాక్షన్‌ పరంగా ఓకే అంటున్నా, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌పై కంప్లైంట్స్‌ చేస్తున్నారు.

మ్యూజిక్‌ నచ్చలేదని..
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మ్యూజిక్‌ నచ్చలేదని…. ఇంకా ఎఫెక్ట్‌ పెట్టాల్సిందని సూచిస్తున్నారట.. దీంతో కల్కి-2లో సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ను మార్చుతారనే టాక్‌ వినిపిస్తోంది. సంతోష్‌ నారాయణ్‌ ప్లేసులో కల్కి-2 సినిమాకు కీరవాణి మ్యూజిక్‌ డైరెక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నారట చిత్ర యూనిట్‌.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన కీరవాణి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో తీసిన కల్కి సినిమాకు ఆ రేంజ్‌లోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెడితే బాగుండేదని సూచిస్తున్నారు సినీ పండితులు. అందుకే కల్కి-2లో కీరవాణి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ఐతే ప్రస్తుతం కీరవాణి బిజీగా ఉన్నారంటున్నారు.

రాజమౌళి-మహేశ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాకు కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయితేనే కీరవాణికి సమయం దొరుకుతుందట.. అంతవరకు కల్కి-2 యూనిట్‌ ఓపికగా ఎదురుచూస్తుందా? సంతోష్‌ నారాయణ్‌తోనే కానిచ్చేస్తుందా? అన్న సందేహమూ వెంటాడుతోంది.

కల్కి-2 షూటింగ్‌ ఇప్పటికే సగం పూర్తయిందంటున్నారు. మిగిలిన షూటింగ్‌ పూర్తి చేయాలంటే ఇంకా రెండేళ్ల సమయం పట్టొచ్చని అంటున్నారు. దీంతో కల్కి-2లో కీరవాణి మ్యూజిక్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.

2024 Tollywood Movies : ‘హనుమాన్’ నుంచి ‘కల్కి’ వరకు.. 2024 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్.. ఏవి హిట్టు? ఏవి ఫట్టు?