Prabhas Kalki 2898 Ad Movie Two Days Collections
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 298.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. మొదటి రోజు (గురువారం ) ఈ మూవీ 191.5 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషించారు.
The love is pouring in from all corners of the world! ❤️?#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/o2v5mfOiUN
— Kalki 2898 AD (@Kalki2898AD) June 29, 2024