Veera Simha Reddy: చెన్నకేశవరెడ్డి ఎపిసోడ్‌ను దించేస్తున్న వీరసింహారెడ్డి.. ఫ్యాన్స్ రెడీగా ఉండాలట!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఆగమనానికి మరో వారం రోజులే ఉంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు అభిమానుల్లోనూ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6న ఒంగోలులో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆతృతగా చూస్తున్నారు.

Veera Simha Reddy: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఆగమనానికి మరో వారం రోజులే ఉంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు అభిమానుల్లోనూ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6న ఒంగోలులో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆతృతగా చూస్తున్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్‌తో యూట్యూబ్‌లో రచ్చరచ్చే అంటోన్న థమన్!

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా నెట్టింట మరో వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలోని పెద్ద బాలకృష్ణ పాత్రను ఇంట్రొడ్యూస్ చేసే క్రమంలో జరిగే భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందట. అయితే ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో భారీగా సుమోలు గాల్లో లేవనున్నాయట. అప్పుడే పెద్ద బాలకృష్ణ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలోనూ సుమోలను గాల్లోకి లేపారు. ‘‘సత్తిరెడ్డి…’’ అంటూ బాలయ్య అరవగానే భూమిలో నుంచి పలు సుమోలు గాల్లోకి లేచిన సీన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో రెండు తమిళ సినిమాలతో సమానంగా దిగుతున్న వీరసింహారెడ్డి!

ఇప్పుడు అలాంటిదే మరో ఎపిసోడ్‌ను గోపీచంద్ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుందట. ఈ ఎపిసోడ్ జరుగుతున్నంతసేపు అభిమానులు సీట్లలో నుంచి లేచి నిల్చోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఆ తరువాత వచ్చే ప్రతి సీన్ గూస్‌బంప్స్ తెప్పించేవిగా ఉంటాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు