Radhe Shyam: రూట్ మార్చేశారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో హోస్టింగ్!

ఎక్కడ విన్నా ఇప్పుడు సంక్రాంతి సినిమాల గురించే టాపిక్ అంతా. నిన్న, మొన్నటి వరకు వచ్చే సంక్రాంతికి నాలుగైదు సినిమాలు ఉంటాయని అనుకున్నా.. ఇప్పుడు ఇద్దరే సంక్రాంతి పందెం కోళ్లు...

Radhe Shyam: ఎక్కడ విన్నా ఇప్పుడు సంక్రాంతి సినిమాల గురించే టాపిక్ అంతా. నిన్న, మొన్నటి వరకు వచ్చే సంక్రాంతికి నాలుగైదు సినిమాలు ఉంటాయని అనుకున్నా.. ఇప్పుడు ఇద్దరే సంక్రాంతి పందెం కోళ్లు అని తేలిపోయింది. ఒకవైపు ఆర్ఆర్ఆర్.. మరోవైపు రాధేశ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. నేషనల్ వైడ్ రెండు సినిమాలపై ఎంతో ఆసక్తి. కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాల కోసం ఇప్పటికే మేకర్స్ భారీ ఎత్తున ప్రచారం కూడా మొదలు పెట్టగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు చూసేస్తామా అని ఎంతో వెయిట్ చేస్తున్నారు.

Bangarraju: సంక్రాంతికి ఉన్నట్లా.. లేనట్లా? టెన్షన్ పెట్టేస్తున్న అక్కినేని హీరోలు!

ఇందులో ఓ వారం ముందే రానున్న ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పూర్తిచేయగా టీమ్ అక్కడే ఉంది ముంబైలో మిగతా పనులు చక్కబెడుతుంది. త్వరలోనే ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. కాగా.. రాధేశ్యామ్ ఇక్కడ నుండే ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం రాధేశ్యామ్ టీమ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లలో కనిపించే ఒకే ఒక్క యాంకర్ సుమ. టైమింగ్, హ్యూమరస్ కలగలిసిన యాంకరింగ్ తో సుమ ఇప్పటి వరకు తిరుగులేకుండా ఏలేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలపై కూడా సెటైర్లు వేయగలిగే చొరవ కూడా సుమకి బాగా కలిసొచ్చింది. అయితే.. ఇప్పుడు రాధేశ్యామ్ ఈవెంట్ కోసం సుమను కాకుండా ఓ యంగ్ హీరోతో ఈవెంట్ హోస్టింగ్ చేయించనున్నట్లు తెలుస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి ఈ ఈవెంట్ కి హోస్టింగ్ చేయనున్నాడట.

Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

ఒక విధంగా ఇది టాలీవుడ్ లో కొత్త సంప్రదాయం. ఇప్పటి వరకు అవార్డు వేడుకలకు మాత్రమే ఇలా యంగ్ హీరోలు హోస్టింగ్ చేస్తుండగా ఇప్పుడు ఓ స్టార్ హీరో ప్రీ రిలీజ్ వేడుకకు మరో యంగ్ హీరోతో హోస్టింగ్ చేయిస్తున్నారు. తాను నటించిన సినిమాలలో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. దానికి తోడు గతంలో జాతిరత్నాలు ప్రొడ్యూసర్స్ ప్రభాస్ కు సన్నిహితులకు కావడంతో ప్రభాస్ ఆ సినిమాకు ప్రమోషన్ చేశారు. అందుకే ఇప్పుడు నవీన్ తో ఈ ఈవెంట్ హోస్టింగ్ చేయించనున్నట్లు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు