YS Sharmila: మళ్లీ బీఆర్ఎస్ దొంగలకే ఈ బాధ్యతలు ఇచ్చారు: వైఎస్ షర్మిల

నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లని షర్మిల అన్నారు.

YS Sharmila

YS Sharmila – Dalit Bandhu : తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితబంధు పథకం గురించి ఆమె ట్వీట్ చేశారు.

” దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన దొర.. దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని బెదిరించి.. ఎన్నికలకు కావల్సినంత తినండని మళ్లీ బీఆర్ఎస్ దొంగలకే బాధ్యతలు ఇచ్చారు. అర్హుల ఎంపిక భాధ్యత మీ బందిపొట్లకే మరోసారి ఇచ్చి.. దళితబంధు పథకాన్ని “కమీషన్ల బంధు” అని చెప్పకనే చెప్పారు.

నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లు. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దొచిపెట్టే కుట్ర ఇది. కమీషన్లు కొట్టండి.. ఎన్నికల్లో ఖర్చు పెట్టండి.. ఇదే దొర ఎమ్మెల్యేలకు ఇచ్చిన బంపర్ ఆఫర్.

పథకం పక్కదారి పట్టింది, ఇందులో ఎమ్మెల్యేలు పబ్లిక్ గా దోచుకుంటున్నారని దళితబంధు ఎమ్మెల్యేల బంధులా మారిందని, సాక్ష్యాధారాలు బయటపెట్టినా.. దొర తీసుకున్న చర్యలు శూన్యం. కమీషన్ల కహానీ బయట పెడితే.. దొర అవినీతిపై ఎమ్మెల్యేలే తిరగబడతరని భయపడుతున్నారు.

మా పార్టీ మరోసారి డిమాండ్ చేస్తోంది.. దళితబంధు ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వెంటనే రద్దు చేయాలి. గ్రామసభలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక ఉండాలి. కమీషన్లు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

MLA Muthireddy Land Dispute : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆయన కుమార్తె  తుల్జా భవానీ మధ్య భూ వివాదం

ట్రెండింగ్ వార్తలు