presidential election: రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

ప్ర‌తిప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా (84) కు కేంద్ర ప్ర‌భుత్వం జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించింది.

presidential election: ప్ర‌తిప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా (84) కు కేంద్ర ప్ర‌భుత్వం జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించింది. ఆయ‌న‌కు కేంద్ర రిజ‌ర్వు పోలీసు ద‌ళం (సీఆర్పీఎఫ్‌) కమాండోలు భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. య‌శ్వంత్ సిన్హా దేశంలోని ఏ ప్ర‌దేశానికి వెళ్లినా ఆయ‌న‌తో 8-10 మంది క‌మాండోలు ఉంటారు. కాగా, ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సీఆర్పీఎఫ్ క‌మాండోల‌తో జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యం తెలిసిందే.

Maharashtra: శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజ‌య్ రౌత్

ద్రౌప‌ది ముర్ము కాసేప‌ట్లో రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నామినేష‌న్ వేయ‌నున్నారు. అలాగే, య‌శ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేష‌న్ వేస్తార‌ని ఎన్సీపీ అధినేత శ‌ద‌ర్ ప‌వార్ ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించారు. నామినేష‌న్ వేసిన అనంత‌రం య‌శ్వంత్ సిన్హా దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టించిన ప‌లు పార్టీల మ‌ద్ద‌తు కోర‌నున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక జూన్ 18న జ‌ర‌గ‌నుంది. వీటి ఫ‌లితాలను జూలై 21న వెల్ల‌డిస్తారు. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం జూలై 24న పూర్తి కానుంది.

ట్రెండింగ్ వార్తలు