Mehendi leaves : ఏడాదిలో రెండుసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే.. మహిళల్లో హార్మోన్లు పనితీరు..?

గోరింటాకు ఇష్టపడని ఆడవారు ఉండరు. గోరింటాకు, మెహందీ పౌడరు రెండిటినీ చేతులకు పెట్టుకుంటూ ఉంటారు. వీటిలో గోరింటాకు శ్రేష్టమైనదని.. ముఖ్యంగా మహిళల్లో ఉండే హార్మోన్ల అసమతుల్యతను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Mehendi leaves : గోరింటాకు ఇష్టపడని ఆడవారుండరు. చేతులు, కాళ్లకు రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. పండగలు, పూజా కార్యక్రమాల్లో ఎర్రగా గోరింట చేతులకు పండాల్సిందే. ఇక పెళ్లిళ్లలో మెహందీ ఫంక్షన్ సందడి  ప్రత్యేకంగా ఉంటుంది. మార్కెట్లో దొరికే కోన్స్ కంటే చెట్టు ఆకులను రుబ్బి పెట్టుకున్న గోరింటతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.

Telugu Girl : పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలుసా?

గోరింటాకు ఒక్కొక్కరికి ఒక్కోలా పండుతుంది. శరీరంలో ఉండే అధిక వేడి కారణంగా కొందరికి మరీ డార్క్‌గా పండుతుంది. చేతినిండా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని ఆడవారు ఆటపట్టించుకుంటూ ఉంటారు. అసలు ఎర్రగా పండేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది గోరింటాకు తీసేసాక నీటితో కడగటానికి ముందు కొబ్బరి నూనుతో మర్దనా చేస్తారు. మరికొందరు ఆకు, లేదా పౌడర్ కలిపేటపుడు అందులో నిమ్మరసం యాడ్ చేస్తారు. అయితే  గోరింటాకు పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతికి గోరింటాకు తీసేయగానే కడగకూడదట. అలాగే సబ్బుతో అస్సలు కడగకూడదట. చల్లని నీటితో మాత్రమే వాష్ చేసుకోవాలి. చేతికి పెట్టుకున్న గోరింట బాగా ఆరిపోయిన తరువాత బెల్లం మరిగించిన నీటిని కాటన్‌లో ముంచి అద్దితే చేతులు ఎర్రగా పండుతాయట.

Latest Mehndi Design : ఓ పెళ్లికూతురి మెహందీ డిజైన్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

గోరింటాకు బాగా పండాలి అంటే లవంగం కాల్చిన పొగను ఆవిరిగా పట్టాలట. ఇలా చేసినా గోరింట ఎర్రటి రంగులో పండుతుందట. కొంతమంది గోరింటాకు పెట్టుకునే ముందు ఉన్న ఆత్రం తర్వాత ఉండదు. దానిని ఎప్పుడు తీసేద్దామా? అని ఆలోచిస్తారు.. అందుకోసం ఫ్యాన్ గాలి దగ్గర పెడుతుంటారు. అలా చేస్తే సరిగా పండదు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కనీసం మహిళలు గోరింటాకును ఏడాదిలో రెండుసార్లైనా అరచేతుల్లో పెట్టుకుంటే హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. వర్షాకాలం, చలికాలాల్లో రెడీమేడ్ మెహందీ పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం కాదని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు