Mount Etna Volcano : ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం.. నిలిచిపోయిన విమాన రాకపోకలు

అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద కారణంగా కాటానియా విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 90 విమానాలు రద్దు అయ్యాయని, సుమారు 15వేల మంది ప్రయాణికులకు

Eruption of Mount Etna

Malta International Airport : యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్నిపర్వతం అయిన మౌంట్ ఎట్నా విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావటంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఈ కారణంగా ఆకాశంలోకి భారీగా బూడిద వెదజల్లుతుంది. అగ్నిపర్వతంకు కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ బూడిదమయం అయ్యాయి. ఇటాలియన్ ద్వీపం సిసిలీలోని కాటానియా విమానాశ్రయంసైతం బూడిదతో నిండిపోయింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Also Read : Heavy Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద కారణంగా కాటానియా విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 90 విమానాలు రద్దు అయ్యాయని, సుమారు 15వేల మంది ప్రయాణికులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం వరకు సాధారణ సర్వీసులు ప్రారంభమవుతాయని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోఫిజికల్ అండ్ వాల్కనాలజీ ప్రకారం.. ఆకాశంలో 4.5కిలో మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడిందని తెలిపింది.

Also Read : ప్రధానిగా చివరి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన రిషి సునాక్.. కీర్ స్టార్మర్ గురించి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిపర్వతం వీడియోలో కాటానియా నగరంలోని రోడ్లు నల్ల బూడిదతో కప్పబడి ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రయాణీకులు కాటానియా విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇటలీలో అత్యంత ప్రసిద్ద పర్యాటక కేంద్రాల్లో తూర్పు సిసిలీ ఒకటి. అక్కడికి ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు.