Heavy Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా

Heavy Rains

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్ – కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read : హార్దిక్‌కు ఎదురైన అవమానాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురైన కృనాల్ పాండ్య..

ఏపీలో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశమూ ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read : ప్రధానిగా చివరి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన రిషి సునాక్.. కీర్ స్టార్మర్ గురించి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా శని, ఆది, సోమ వారాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. మరోవైపు ఆదివారంసైతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 7 (ఆదివారం) సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

జూలై 8 (సోమవారం) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, .జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం అంచనా వేసింది. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ కేంద్రం అంచనా వేసింది.