హార్దిక్‌కు ఎదురైన అవమానాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురైన కృనాల్ పాండ్య..
టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ చిన్ననాటి ఫొటోను షేర్ చేశాడు. గత ఆరు నెలలుగా హార్దిక్ పడినబాధను గుర్తుచేసుకున్నాడు.

Krunal Pandya and Hardik Pandya
Krunal pandya : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా, హార్దిక్ సోదరుడు, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ చిన్ననాటి ఫొటోను షేర్ చేశాడు. గత ఆరు నెలలుగా హార్దిక్ పడినబాధను గుర్తుచేసుకున్నాడు. హార్దిక్, నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించి దాదాపు ఒక దశాబ్దం అయింది. గత ఆరు నెలలు హార్దిక్ కు అత్యంత కష్టతరమైన రోజులుగా గడిచాయి. అతను అనుభవించిన కష్టాలకు అతను అర్హుడు కాదు. ఒక సోదరుడిగా, నేను అతని పట్ల చాలా బాధపడ్డానని కృనాల్ పాండ్యా అన్నారు.
Also Read : Team India : భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్.. అభిమానులతో పోటెత్తిన ముంబై తీరం
ఐపీఎల్ -17లో రోహిత్ శర్మ స్థానంలో ముంబయి కెప్టెన్ అయినప్పుడు హార్దిక్ పట్ల అభిమానులు చూపించిన వ్యతిరేకతకు కృనాల్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషే అని అందరూ మర్చిపోయారు. హార్దిక్ చిరునవ్వుతో ఎలాగో వీటన్నింటిని దాటేశాడు. అయినప్పటికీ, అతను నవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. అతను కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. తన అంతిమ లక్ష్యం ప్రపంచ కప్ ను పొందడానికి అతను ఏమి చేయాలో దానిపై దృష్టిసారించాడు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడు అని కృనాల్ పాండ్యా పేర్కొన్నారు.
Also Read : Mohammed Siraj : హైదరాబాద్‌లో మహమ్మద్ సిరాజ్ రోడ్ షో.. ముంబై విజయోత్సవ ర్యాలీని రీక్రియేట్ చేద్దామా..!
హార్దిక్ పాండ్యాకు ఎల్లప్పుడూ దేశం మొదటి స్థానంలో ఉంటుంది. బరోడా నుంచి వచ్చిన ఒక యువకుడికి తన జట్టు ప్రపంచ కప్ గెలవడానికి సహాయం చేయడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. హార్దిక్.. నేను మీ సోదరుడిగా చాలా గర్వపడుతున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నా బచ్చూ.. నీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది అంటూ కృనాల్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు.
View this post on Instagram