Exercises : కఠినతరమైన వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలోనే చేయటం మంచిదా?

శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొరొనరీ అర్టెరీ వ్యాధులు వృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారి వ్యాయామాల వల్ల మధ్య వయస్సులో అలాగే పెద్దవాళ్లలో హృదయ సంబంధిత మరణాల సంఖ్య తగ్గుతుంది.

Exercises : శారీరక వ్యాయామం అంటే శరీరాన్ని చురుగ్గా ఉంచే ఏదైనా అంశం లేదా శారీరక ధృఢత్వాన్ని అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు దోహదపడుతుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేసే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో బిజీ కారణంగా కనీసం ఇంటి పనులు చేసుకునే పరిస్తితి కూడా కనుమరుగై పోతోంది. దీని ఫలితంగా మానసిక ఆందోళనలు, శారీరక బలం లోపించడం, పనులను పూర్తి చేయకపోవడం వంటి లక్షణాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వ్యాయామంతో ఎలాంటి మేలు ;

వ్యాయామం చేయడం వలన కండరాలను గట్టిగా ఉంచుకోవచ్చు. హృదయ సంబంధ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవడంపాటు, అథ్లెటిక్‌ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం, బరువు తగ్గించుకోవడం వంటి ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం వ్యాయామం చేస్తున్న యువతీ, యువకులు మాత్రం కేవలం ఆకర్షణీయమైన అందాన్ని, ఆకృతిని అతి త్వరగా, అతి కొద్ది కాలంలోనే సొంతం చేసుకోవడానికి అవసరానికి మించి రోజులో గంటల తరబడి వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

క్రమపద్దతిలో, ట్రైనర్ల పర్యవేక్షణలో ;

క్రమ బద్ధంగా, సంబంధిత నిపుణుల సమక్షంలో చేసే శారీరక వ్యాయామాలు కండరాలు, కీళ్ళు కదలికలు సులభతరం చేస్తాయి. సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి మానసిక ఉత్తేజాన్ని అందిస్తాయి. వీటితోపాటు కసరత్తులు, బరువు తగ్గడానికి మనకు ఉపకరిస్తాయి. వీటి వలన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకోవడంతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని వ్యాయామ నిపుణులు చెప్తున్నారు. అదేసమయంలో ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ ల సలహాలు సూచనలు పాటించకుండా అతిగా వ్యాయామం చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యానికి లాభాలు ;

శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొరొనరీ అర్టెరీ వ్యాధులు వృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారి వ్యాయామాల వల్ల మధ్య వయస్సులో అలాగే పెద్దవాళ్లలో హృదయ సంబంధిత మరణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో సరైన పౌష్టికాహారం కూడా అంతే అవసరం. వ్యాయామం చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం.

ట్రెండింగ్ వార్తలు