Night Without Sleep : రాత్రి సమయంలో నిద్రపోకుండా మేల్కొని ఉంటున్నారా? రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులు వచ్చే ప్రమాదం!

రాత్రి నిద్రలేమి పరిస్ధితులు కాలక్రమేణా, నిద్ర సమస్యలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ వాయుమార్గం పదేపదే నిరోధించబడినప్పుడు స్లీప్ అప్నియా సమస్య వస్తుంది. దీనినే గురక సమస్య అనికూడా అంటారు.

Night Without Sleep : నిద్ర అనేది లగ్జరీ కాదు. ఇది మంచి ఆరోగ్యానికి కీలకం. నిద్ర మీ శరీరాన్ని సరిదిద్దడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో తగినంత మంచి నిద్ర పోవటం పగటిపూట పనిచేయడానికి సహాయపడుతుంది. మనిషికి నిద్ర చాలా అవసరం. మనిషి ఏ రోగాలు లేకుండా జీవించాలంటే నిద్ర కూడా ఉండాల్సిందే. సరిగా నిద్ర లేని వారికి రోగాలు చుట్టుముట్టే అవకాశాలే ఎక్కువ. పెద్దలకు ప్రతి రాత్రి కనీసం 7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర లేకపోతే కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

ప్రతి రోజు రాత్రి 7 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయే పెద్దల్లో గుండెపోటు, ఆస్తమా మరియు డిప్రెషన్‌తో సహా ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో నిద్రలేమి అన్నది గుండె జబ్బులు, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీంతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యల ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అధిక రక్త పోటు ; సాధారణ నిద్రలో, మీ రక్తపోటు తగ్గుతుంది. నిద్ర లేమి సమస్యలను కలిగి ఉండటం వల్ల రక్తపోటు ఎక్కువ కాలం పాటు ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌లకు అధిక రక్తపోటు ప్రధాన ప్రమాదాలలో ఒకటి.

టైప్ 2 డయాబెటిస్ ; డయాబెటిస్ అనేది మీ రక్తంలో చక్కెరను పెంచడానికి కారణమయ్యే వ్యాధి, ఇది మీ రక్తనాళాలను దెబ్బతీసే పరిస్థితి. కొన్ని అధ్యయనాల ప్రకారం మంచి నిద్ర వల్ల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిర్ధారణ అయింది.

ఊబకాయం ; నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యకరమైన బరువు పెరగవచ్చు. పెద్దల కంటే ఎక్కువ నిద్ర అవసరమయ్యే పిల్లలు,యువత రాత్రి నిద్రకు దూరమైతే ఊబకాయ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే మెదడులోని ఒక భాగంపై ప్రభావం పడుతుంది.

రాత్రి నిద్రలేమి పరిస్ధితులు కాలక్రమేణా, నిద్ర సమస్యలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ వాయుమార్గం పదేపదే నిరోధించబడినప్పుడు స్లీప్ అప్నియా సమస్య వస్తుంది. దీనినే గురక సమస్య అనికూడా అంటారు. దీని వలన మీరు తక్కువ సమయం పాటు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఊబకాయం మరియు గుండె వైఫల్యం వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల స్లీప్ అప్నియా వస్తుంది.స్లీప్ అప్నియా మీరు నిద్రిస్తున్నప్పుడు శరీరానికి అందే ఆక్సిజన్ పై ప్రభావం చూపిస్తుంది.అధిక రక్తపోటు, గుండెపోటు మరియు స్ట్రోక్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రుళ్లు మేల్కొని ఉంటూ నిద్ర పోకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీదే పడుతుంది. ప్రతి మనిషి సగటును 7-8 గంటలు నిద్ర పోవాల్సిందే. లేదంటే వ్యాధులు దరిచేరే ప్రమాదం పొంచి ఉంటుంది. రాత్రుళ్లు సరిగా నిద్ర పోకుండా తెల్లవార్లు మేల్కొని ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. అందుకే నిద్ర పోవడానికి కేటాయించిన సమయంలో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలే కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తే మనకు ఇబ్బందులు తప్పవు. అన్ని జబ్బులకు నిద్ర పరిష్కారమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రను అలక్ష్యం చేయకుండా సరైన సమయంలో నిద్ర పోతే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. తిండి ఎంత బలమో నిద్ర కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి.

 

ట్రెండింగ్ వార్తలు