Thaman : అఖండ సినిమాలో థమన్ క్రెడిట్ ఏం లేదంటున్న బోయపాటి..

అఖండ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రతి ఆడియెన్ మాట్లాడిన మొదటి మాట.. థమన్ బ్యాక్‌గ్రౌండ్. అయితే అఖండలో థమన్ క్రెడిట్ ఏం లేదు అంటున్నాడు బోయపాటి.

Thaman : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత్తం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల సినిమాలు అన్నిటికి సంగీతం అందిస్తూ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈమధ్య కాలంలో థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోనే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి అని ప్రేక్షకులు అంటున్న మాట. అయితే ఈ మాట తప్పు అంటున్నాడు బోయపాటి శ్రీను. థమన్, బోయపాటి కలయికలో సరైనోడు, అఖండ, స్కంద సినిమాలు వచ్చాయి. మూడు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి.

Also Read : Swayambhu : ట్రైనింగ్ అయ్యిపోయింది.. ఇక యుద్దానికి సిద్దమవుతున్న నిఖిల్..

సరైనోడు సినిమాలోని సాంగ్స్ ని మంచి క్రేజ్ రావడంతో మూవీ సక్సెస్ లో మంచి పాత్రే పోషించింది. ఇక అఖండ మూవీకి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అరాచకం. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రతి ఆడియెన్ మాట్లాడిన మొదటి మాట.. థమన్ బ్యాక్‌గ్రౌండ్. అయితే అఖండలో థమన్ క్రెడిట్ ఏం లేదు అంటున్నాడు బోయపాటి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బోయపాటిని ప్రశ్నిస్తూ.. ‘అఖండకి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణమైంది. కానీ స్కందకి అది కొంచెం తగ్గిందని నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. దానిపై మీ రియాక్షన్’ అని అడిగారు.

Also Read : Bigg Boss 7 : ఈవారం ఈ కంటెస్టెంట్స్ బాగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారా..?

బోయపాటి బదులిస్తూ.. ‘స్కంద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫీడ్ బ్యాక్ గురించి నేను ఒకసారి రివ్యూ చేస్తాను. ఎందుకు అలా జరిగిందని’ చెప్పుకొచ్చిన ఈ మాస్ డైరెక్టర్.. ‘అఖండ సినిమాని మ్యూజిక్ లేకుండా చూసినా అదే హై ఉంటుంది. ఆ కథలో అంత దమ్ము ఉంది’ అంటూ థమన్ చేసిందేమీ లేదంటూ మాట్లాడాడు. ప్రస్తుత్తం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. థమన్ ఫ్యాన్స్ ఈ విషయమై బోయపాటి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా థమన్ ప్రస్తుతం గుంటూరు కారం, OG, గేమ్ ఛేంజర్, RT4GM.. తదితరుల స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు