Director Ubaini : సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చారని పోలీస్ కేస్ పెట్టిన డైరెక్టర్.. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

తాజాగా మలయాళంలో ఓ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన పలువురిపై ఆ సినిమా డైరెక్టర్ కేసు పెట్టాడు. డైరెక్టర్ ఉబైని దర్శకత్వంలో ఇటీవల అక్టోబర్ 13న రహీల్ మకన్ కోరా(Rahel Makan Kora) అనే సినిమా రిలీజయింది.

Director Ubaini files a case for giving Negative Reviews for his Film

Director Ubaini : ఇటీవల సినిమాలు రిలీజ్ అయిన మొదటి ఆట అవ్వగానే చాలా మంది సినిమా రివ్యూలు ఇస్తున్నారు. టీవీ ఛానల్స్, వెబ్ సైట్స్, సినిమా జర్నలిస్టులు మాత్రమే కాకుండా ఇటీవల చాలా మంది యూట్యూబర్స్, సోషల్ మీడియాలో పలువురు సినిమా చూసి తమకు నచ్చినట్టు రివ్యూలు చెప్తున్నారు. కొంతమంది కావాలని కూడా తమకి నచ్చని హీరో, హీరోయిన్స్.. ఇలా ఎవరైనా ఉంటే నెగిటివ్ రివ్యూస్ కూడా చెప్తున్నారు. కొంతమంది డబ్బులు తీసుకొని పాజిటివ్ రివ్యూస్ చెప్తున్నారు. దీనివల్ల సినిమాల ప్రభావం పడుతుంది.

తాజాగా మలయాళంలో ఓ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన పలువురిపై ఆ సినిమా డైరెక్టర్ కేసు పెట్టాడు. డైరెక్టర్ ఉబైని దర్శకత్వంలో ఇటీవల అక్టోబర్ 13న రహీల్ మకన్ కోరా(Rahel Makan Kora) అనే సినిమా రిలీజయింది. అయితే ఈ సినిమాపై అదేరోజు పలువురు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో వీడియోలు, కంటెంట్ పోస్ట్ చేశారు. దీనిపై డైరెక్టర్ ఉబైని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సినిమాపై కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని, తన సినిమా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అలాగే సినిమా రిలీజయ్యాక వారం రోజుల పాటు ఎవరూ రివ్యూలు చెప్పకూడదని, అలాగే ఫేక్ ఐడిల నుంచి రివ్యూలు పోస్ట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో కూడా కేసు వేశాడు.

Also Read : Yatra 2 : జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా ?

దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఏదో ఒక రూపంలో ఎలా ఉందో చాలామంది చెప్తారు. ఇలా నెగిటివ్ గా రివ్యూ ఇస్తే కేసు పెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇక కోర్టులో ఈ కేసుపై చర్చించి.. సోషల్ మీడియాల్లో ఫేక్ ఐడీలతో కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై చర్యలు చేపట్టాలని, రివ్యూ చెప్తే అది ఎవరు చెప్పారు అనేది కచ్చితంగా డీటెయిల్స్ ఉండాలని, సైబర్ సెల్ దీనిపై దృష్టి సారించాలని తెలిపింది. ఈ కేసు ఇంకా కోర్టులో సాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు