NBK107: బాలయ్యతో డైరెక్టర్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో బాలయ్య, శ్రుతి హాసన్‌లతో పాటు పలువురు నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రబోతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

NBK107 Eyes On Dussehra Release: పండగకే దిగుతానంటోన్న బాలయ్య.. ఫ్యాన్స్ కోసమేనట!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో బాలయ్య, శ్రుతి హాసన్‌లతో పాటు పలువురు నటీనటులు కూడా పాల్గొంటున్నారు. టర్కీ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్ర యూనిట్ చిత్రీకరించనున్నారు.

NBK107: బాలయ్య సినిమా టైటిల్.. ఆ రోజున వచ్చేస్తుందా?

అయితే ఈ క్రమంలో బాలయ్య, శ్రుతి హాసన్‌తో కలిసి దర్శకుడు గోపీచంద్ మలినేని తీసుకున్న ఓ సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోలో బాలయ్య, శ్రుతి హాసన్‌లు స్వాగ్ పోజివ్వడంతో అభిమానులు సంతోషంగా ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు