RRR : ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్.. గవర్నర్ అవార్డ్స్‌లో హాలీవుడ్ టాప్ డైరెక్టర్..

'ఆర్‌ఆర్‌ఆర్' సృష్టించిన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి తన అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తో ప్రపంచ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యేలా చేశాడు. తాజాగా ఈ దర్శకుడు గవర్నర్ అవార్డ్స్ పురస్కాలకు హాజరయ్యాడు. ఆ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాత సినీ సాంకేతిక నిపుణులు హాజరవుతుండగా, హాలీవుడ్ టాప్ డైరెక్టర్.. తాను "ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్" అంటూ వ్యాఖ్యానించాడు.

RRR : ‘ఆర్‌ఆర్‌ఆర్’ సృష్టించిన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి తన అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తో ప్రపంచ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యేలా చేశాడు. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ సాంకేతిక నిపుణులు జక్కన్న చెక్కిన RRR లోని సన్నివేశాలు చూసి అదరహో అంటున్నారు.

Rajmouli-Mahesh Movie: రియల్ లైఫ్ స్టోరీతో మహేష్-రాజమౌళి సినిమా.. విజయేంద్రప్రసాద్!

ఇక ఈ సినిమా ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల రేస్ నిలవగా, దర్శకుడు రాజమౌళి సినిమా ఆస్కార్ కాంపెయిన్ చేస్తూ అమెరికాలోని పలు నగరాల్లో సంచరిస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు గవర్నర్ అవార్డ్స్ పురస్కాలకు హాజరయ్యాడు. ఆ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాత సినీ సాంకేతిక నిపుణులు హాజరవుతుండగా, హాలీవుడ్ టాప్ డైరెక్టర్.. తాను “ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్” అంటూ వ్యాఖ్యానించాడు.

స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ‘జె జె అబ్రామ్స్’, రాజమౌళిని గవర్నర్ అవార్డ్స్ వేడుకలలో కలుసుకున్నాడు. ఆ తరుణంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చూసి అభిమానిగా మారిపోయినట్లు వెల్లడించాడట. ఈ విషయాన్ని RRR టీమ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు